జయమునిచ్చే జయదుర్గ
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ చేయడానికిగాను అనేక అవతారాలను ధరించింది. అలాంటి శక్తి రూపాలలో దుర్గాదేవికి మరింత విశిష్టత వుంది. లోక కంటకుడైన మహిషాసురుడిని సంహరించిన అమ్మవారు, దుర్గాదేవిగా సమస్త దేవతల నీరాజనాలు అందుకుంది. దుష్ట శక్తుల బారి నుంచి మానవులను సదా కాపాడుతూ ఉండమని మహర్షులు కోరడంతో అమ్మవారు అందుకు అంగీకరించింది.
ఈ నేపథ్యంలోనే అమ్మవారు అనేక పవిత్ర ప్రదేశాల్లో ఆవిర్భవించింది. ఆ ప్రదేశాలన్నీ కూడా నేడు శక్తి క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. శత్రు భయాన్ని పోగొట్టడమే కాకుండా, విజయాలను .. సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే ఆ తల్లిని భక్తులు ఇలవేల్పుగా భావిస్తూ వుంటారు. ఆ తల్లిని అనునిత్యం దర్శించుకోవడం కోసం తమ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించుకుంటూ వుంటారు.
హైదరాబాద్ - వనస్థలిపురంలో గల 'జయదుర్గ' ఆలయం కూడా ఈ నేపథ్యంలో నిర్మించబడిందే. ఓ భక్తురాలికి అమ్మవారు స్వప్న దర్శనమిచ్చి తన ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడం వలన, నేడు అమ్మవారి దర్శనం అందరికీ లభిస్తోంది. గర్భాలయంలో అమ్మవారు చక్కని రూపురేఖలతో .. తేజస్సుతో వెలుగొందుతూ వుంటుంది. ప్రతి మంగళ - శుక్ర వారాల్లో అమ్మవారిని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.
ఇదే ప్రాంగణంలో శంకరుడు ... గణపతి .. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు దర్శనమిస్తూ వుంటాయి. శివ కుటుంబం కొలువైన కారణంగా ఆయా పుణ్య తిథుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడి అమ్మవారిని దర్శించి ... ఆమె ఆశీస్సులు తీసుకుని కొత్తగా ఏ రంగానికి సంబంధించిన పనిని ప్రారంభించినా జయం కలుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.