పశ్చాత్తాప ఫలితం
జన్మనిచ్చిన తల్లిదండ్రులను బాధించి, బాధ్యత లేకుండా ప్రవర్తించినందుకు పుండరీకుడు సిగ్గుపడతాడు. కన్నవారి మనసు కష్టపెట్టి వాళ్లకి నిలువ నీడ కూడా లేకుండా చేసినందుకు తనని తాను నిందించుకుంటాడు. తాను చేసిన పాపం కారణంగానే తన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
తన తల్లిదండ్రుల జాడ తెలుసుకుని వారి సేవలో తరించడం కంటే, తన పాపానికి పరిహారం లేదని భావించి నేలపై శరీరాన్ని ఈడ్చుకుంటూ బయలుదేరుతాడు. ఆయన గురించి తెలిసిన వాళ్లెవరూ జాలి పడకపోగా, తల్లిదండ్రులను బాధించినందుకు భగవంతుడు తగిన శిక్ష వేశాడని అనుకుంటూ వుంటారు. ఆ మాటలు పుండరీకుడిని మరింత బాధకు గురిచేస్తూ వుంటాయి. అలా కొంతకాలం తరువాత పుండరీకుడు తన తల్లిదండ్రులను కలుసుకుంటాడు.
కాళ్లు చచ్చుబడిపోయిన కొడుకు పరిస్థితిని చూసి వాళ్లు తల్లడిల్లిపోతారు. తన పరిస్థితి గురించి బాధ పడొద్దనీ, తల్లిదండ్రులను అవమానించిన తనకి దైవం సరైన శిక్షనే వేసిందని అంటాడు పుండరీకుడు. తాను ఎన్ని విధాలుగా బాధించినా మనసులో పెట్టుకోకుండా, ఆదరించిన తల్లిదండ్రుల కాళ్లను గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో వాళ్ల పాదాలు కడుగుతాడు. పశ్చాత్తాపం అతని పాపాన్ని దహించి వేయడంతో, చచ్చుబడిపోయిన కాళ్లు యధాస్థితికి వస్తాయి.
దాంతో పుండరీకుడు ఆనందంతో పొంగిపోతాడు. తల్లిదండ్రుల క్షమా గుణం ... వేల సంవత్సరాల పాటు తపస్సు చేయడం వలన దైవం ప్రసాదించే వరం కన్నా గొప్పదని అంటాడు. ఆ క్షమాగుణ ఫలితంగానే తనకి శాపవిమోచనం అయిందని చెబుతాడు. ఇకపై కన్నవారిని సేవించుకోవడం మినహా తనకి మరో లక్ష్యం లేదంటూ వారిని వెంటబెట్టుకుని తన ఇంటికి బయలుదేరుతాడు.