సౌభాగ్యం నిలుపుకోవడానికి సావిత్రి ఏం చేసింది ?

సౌభాగ్యం నిలుపుకోవడానికి సావిత్రి ఏం చేసింది ?
సత్యవంతుడికి మరణ సమయం ఆసన్నమవుతూ వుంటుంది. ఆ విషయం తెలిసి అతని భార్య అయిన సావిత్రి ... అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ వుంటారు. నారద మహర్షి సూచన మేరకు భవానీ దీక్షను చేపట్టి, 'త్రిరాత్రి వ్రతం' చేస్తూ వుంటుంది సావిత్రి. తన భర్తకు ఆయుష్షును ప్రసాదించమని అమ్మవారిని అనుక్షణం కోరుతూ వుంటుంది. వ్రతం మూడవ రోజున సత్యవంతుడు కట్టెలు తీసుకురావడానికి అడవికి బయలుదేరుతాడు.

జరగబోయేదేవిటో ముందుగానే తెలిసిన సావిత్రి మరింత ఆందోళనకి లోనవుతుంది. వద్దని సావిత్రి ఎంతగా వారించినా ఆయన వినిపించుకోడు. దాంతో తనని కూడా తీసుకు వెళ్లమంటూ ఆమె పట్టుపడుతుంది. ఆమె ధోరణి ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులను చూస్తూ ఆశ్రమం చెంతనే ఉండమని ఆయన ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోదు. సత్యవంతుడితో పాటు తాను అడవికి వెళుతున్నట్టుగా అత్తమామలతో చెబుతుంది. ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆ వృద్ధ దంపతులు అందుకు అంగీకరిస్తారు.

దాంతో తాను వెంట వుంటే తన భర్తని మరణ గండం నుంచి కాపాడవచ్చనే ధైర్యంతో సావిత్రి అతనితో పాటు అడవికి బయలుదేరుతుంది. మృత్యువు ఏ రూపంలో ముంచుకు రానుందోనని అన్ని దిక్కులను పరిశీలిస్తూ ఆమె అడవిలో నడవసాగింది. ఆమె మనసు మాత్రం భవానీదేవి పై లగ్నమై వుంటుంది. అదే సమయంలో ... సత్యవంతుడి ఆయుష్షు తీరిందని యమధర్మరాజుకి చిత్రగుప్తుడు గుర్తుచేస్తాడు. దాంతో సత్యవంతుడి ప్రాణాలు తీయడానికి యమపాశం చేతబట్టి యమధర్మరాజు బయలుదేరుతాడు.

More Bhakti Articles