పాడిపంటల నిచ్చే అమ్మవారు
గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు తమ గ్రామంలో ప్రతిష్ఠించుకున్న అమ్మవారిని ఇలవేల్పుగా భావించి పూజిస్తూ వుంటారు. వ్యాధుల నుంచి ... బాధల నుంచి తమని అమ్మవారే కాపాడుతూ ఉంటుందని బలంగా విశ్వసిస్తూ వుంటారు. అమ్మవారి సంతోషం కోసం ... తమ సంతృప్తి కోసం ఉత్సవాలు - ఊరేగింపులు నిర్వహిస్తుంటారు. అలా గ్రామస్తులచే నిత్య నీరాజనాలు అందుకునే అమ్మవారు మహబూబ్ నగర్ జిల్లా 'గద్వాల' లో కనిపిస్తుంది.
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు ఇక్కడ 'జమ్ములమ్మ' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటుంది. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతు పొలాన్ని దున్నుతూ వుంటే, అమ్మవారి విగ్రహం బయటపడింది. అప్పుడా విగ్రహాన్ని పొలంగట్టునే వున్న 'జమ్మిచెట్టు' కింద ఉంచారు. అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించే వరకూ ఇక్కడే పూజించుకున్నారు. అందువలన అమ్మవారు 'జమ్ములమ్మ' గా ప్రసిద్ధి చెందింది.
అమ్మవారి ఆలయం స్థానికుల భక్తి శ్రద్ధలకు అద్దం పడుతూ వుంటుంది. గర్భాలయంలో అమ్మవారి ప్రతిమ చిన్నదే అయినా, ఆ తల్లి మనసు పెద్దదని భక్తులు చెబుతుంటారు. అమ్మవారి అనుగ్రహం కారణంగానే పాడిపంటలు వృద్ధి చెందుతున్నాయని ఇక్కడి వారు విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే ప్రకృతి ద్వారా ఆ తల్లి ప్రసాదించినవి ఆమెకి నైవేద్యంగా సమర్పించాకే వాళ్లు స్వీకరిస్తూ వుంటారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి 'బోనాలు' సమర్పించుకుని అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.