యమపాశాన్ని అడ్డుకున్న గాజులు
రావణాసురుడి చెరలో బందీగా వున్న సీతను విడిపించుకు వెళ్లడానికి వానరసేనతో రామలక్ష్మణులు లంకా పట్టణానికి చేరుకుంటారు. రావణాసురుడి కుమారుడైన మేఘనాథుడితో లక్ష్మణుడు యుద్ధం చేస్తుంటాడు. భర్త ఆగ్రహానికి గురై చెరసాలలో వున్న మేఘనాథుడి భార్య సులోచన, ఆయన ప్రాణాలకి హాని కలుగుతుందేమోనని ఆందోళన చెందుతూ వుంటుంది.
తన భర్త ప్రాణాలను రక్షించమంటూ శ్రీ మహావిష్ణువును ప్రార్ధిస్తుంది. అన్నపానియాలుమాని వ్రతదీక్షను చేపడుతుంది. మేఘనాథుడు తన మాయోపాయాలతో లక్ష్మణుడిని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసి శ్రీరాముడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. మేఘనాథుడిని సంహరించడానికి అడుగుముందుకు వేస్తాడు. అయితే మహా పతివ్రత అయిన సులోచన చేస్తోన్న వ్రత మహిమ ఆయన్ని చేరుతుంది. దాంతో భక్తురాలి విన్నపానికి కట్టుబడి రాముడు ముందుకు వెళ్లలేకపోతాడు.
అదే సమయంలో మేఘనాథుడికి మరణ సమయం ఆసన్నమవుతుంది. దాంతో యమధర్మరాజు యమపాశాన్ని ప్రయోగిస్తాడు. తన పాతివ్రత్య మహిమచే ఈ విషయాన్ని గ్రహించిన సులోచన తన చేతి గాజులనే ఆయుధంగా ప్రయోగిస్తుంది. లక్ష్మణుడితో యుద్ధం చేస్తోన్న మేఘనాథుడిని సమీపించడానికి యమపాశం ప్రయత్నిస్తూ వుంటుంది. సులోచన ప్రయోగించిన గాజులు ఆ యమపాశానికి అడ్డుపడుతుంటాయి.
సులోచన గాజులను దాటుకుని యమపాశం ముందుకు వెళ్లడం అసాధ్యమనే విషయం యమధర్మరాజుకి అర్థమై పోతుంది. దాంతో సులోచన వ్రతానికి భంగం కలిగించడం కోసం ఆమె అత్తగారైన మండోదరి రూపంలో ఒక మాయావిని పంపుతాడు. చెరసాలలో వున్న సులోచన దగ్గరికి వచ్చిన ఆ మాయావి, ఆమె పాతివ్రత్య శక్తిని భరించలేక అక్కడే భస్మమైపోతాడు.