ధనుర్మాసంలో తిరుమల కృష్ణుడు
క్షేత్రమంటే తిరుమలయే ... దైవమంటే శ్రీనివాసుడేనని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి శ్రీనివాసుడు తిరుమలలో మొదటిసారిగా వకుళ మాతను కలుసుకున్నప్పుడు తన పేరు గోవిందుడనే చెప్పుకున్నాడు. ఈ కారణంగానే తిరుమల శ్రీనివాసుడిని దర్శించడానికి వచ్చే వాళ్లు, మెట్టు మెట్టుకు ''గోవిందా'' అని పిలుచుకుంటూ ఆయన సన్నిధికి చేరుకుంటారు.
శ్రీకృష్ణుడే తానని చాటిచెప్పడం కోసమే గర్భాలయంలోని స్వామి ఉదయాన్నే వెన్న - ఆవుపాలు ఆరగిస్తూ వుంటాడు. ఇందుకు నిదర్శనంగానే శ్రీవారి గర్భాలయంలో రుక్మిణీ కృష్ణుల ఉత్సవమూర్తులు దర్శనమిస్తుంటాయి. విశేషమైన పుణ్య తిథుల్లో ఈ అందాల జంటకు ప్రత్యేక పూజాభిషేకాలు ... ఊరేగింపులు నిర్వహిస్తుంటారు. సాధారణంగా ఉదయాన్నే సుప్రభాతాన్ని వింటూ తిరుమల కొండలు పరవశించిపోతుంటాయి.
ఆ సుప్రభాతాన్ని అన్ని దిశలకు మోసుకు వెళుతున్నందుకు వాయుదేవుడు సైతం తన జన్మ ధన్యమైందని అనుకుంటూ వుంటాడు. తిరుమల చేరుకున్న భక్తుల అలసట ఈ సుప్రభాతం వినడం వల్లనే మటుమాయమైపోతుంది. అంతటి మహిమాన్వితమైన సుప్రభాతానికి బదులుగా తిరుమలలో ఈ ధనుర్మాసమంతా కూడా 'తిరుప్పావై' వినిపిస్తుంది.
ధనుర్మాసంలో నిర్వహించే ఏకాంత సేవలో భోగ శ్రీనివాసుడికి బదులుగా, శ్రీ కృష్ణుడి ప్రతిమను శయనింపజేస్తారు. మరునాడు ఉదయమే గోదాదేవి రచించిన పాశురాలను పాడుతూ స్వామిని మేల్కొల్పుతారు. అలా ధనుర్మాసంలో తిరుమల శ్రీనివాసుడు, ద్వాపరయుగం నాటి చిన్ని కృష్ణుడిని మన కళ్లముందుచుతూ అద్భుతమైన ఆయన లీలా విశేషాలను అందంగా ఆవిష్కరిస్తూ వుంటాడు.