మహాభక్తులను మోసగిస్తే ?
సాధారణంగా నిజమైన భక్తిగల వాళ్లు దైవం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ వుంటారు. ఇతరులకి సహాయపడటమే గానీ, మోసం చేయడం వీరికి తెలియదు. వీరిలో మంచితనం పాళ్లు ఎక్కువగా వుండటం వలన, అది అమయాకత్వంగా భావించి ఇతరులే మోసం చేస్తుంటారు. అయితే తన భక్తులను మోసం చేయడానికి ప్రయత్నిస్తే భగవంతుడు ఊరుకుంటాడా అంటే అస్సలు ఊరుకోడనే చెప్పాలి.
ఇదే విషయాన్ని సక్కుబాయి జీవితంలో జరిగిన ఓ సంఘటన మరోమారు స్పష్టం చేస్తోంది. ఒకసారి సక్కుబాయి మంచినీళ్లు తీసుకురావడానికి నదీ తీరానికి వెళుతుంది. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం చూడగానే ఆమెకి, బృందావనంలో విహరిస్తోన్న శ్రీ కృష్ణుడు గుర్తుకొస్తాడు. అలా ఆమె తనని తాను మైమరచిపోయి వున్న స్థితిలో, ఆ పక్కనే వున్న మరో స్త్రీ .. సక్కుబాయి ఇత్తడి బిందెను దొంగిలించుకుపోతుంది.
సక్కుబాయి కోసం ఎదురుచూస్తోన్న ఆమె అత్తగారు, బిందెను దొంగిలించుకుపోతోన్న యువతిని చూసి నిలదీస్తుంది. తన తప్పును అంగీకరిస్తూ ఆ యువతి బిందెను ఇవ్వబోగా చేతిలో నుంచి అది ఎంతకూ రాదు. నీళ్ల బిందె శరీరానికి అతుక్కోవడం ... అది ఎంతకూ ఊడి రాకపోవడం ఊళ్లో వాళ్లందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమె చేతిలోని బిందెను కిందికి దింపడానికి ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతుంది.
బిందె బరువును మోయలేక ... దానిని కిందకు దించే అవకాశం లేకపోవడంతో, దొంగిలించిన యువతి నానాకష్టాలు పడుతుంటుంది. అదే సమయంలో సక్కుబాయి నదీ తీరం నుంచి అక్కడికి చేరుకుంటుంది. విషయం తెలుసుకున్న ఆమె బిందెను దొంగిలించిన యువతిని ఒక్కమాట కూడా అనకుండా, అవలీలగా ఆమె చేతిలోని బిందెను కిందకి దించుతుంది. ఆ దృశ్యం చూసిన వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.
సక్కుబాయి సాధారణమైన యువతి కాదనే విషయం వాళ్లకి అర్థమైపోతుంది. బిందెను దొంగిలించిన యువతి సక్కుబాయి కాళ్లపై పడుతుంది. ఆమె వంటి మహాఇల్లాలిని ... భక్తురాలిని మోసం చేసినందుకు భగవంతుడు తనకి తగిన శాస్తి చేశాడంటూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తుంది. ఇకపై ఎప్పుడూ ఇలా చేయనంటూ చెప్పి అక్కడి నుంచి వెనుదిరుగుతుంది.