ఒకరోజే దర్శనమిచ్చే స్వామి
మహా పుణ్యక్షేత్రాలలోని ఆలయాలను మినహా ఇస్తే, మిగతా క్షేత్రాలలోని ఆలయాలను మధ్యాహ్నం వేళ మహా నైవేద్యం సమర్పించాక కొంతసేపు తలుపులు మూసి ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం వేళ తలుపులు తెరుస్తూ వుంటారు. ఇలా ప్రతి ఆలయానికి దర్శన వేళలు ఉంటూ వుంటాయి ... ఆ సమయాలను బట్టి భక్తులు దైవ దర్శనం చేసుకుంటూ వుంటారు.
మధ్యాహ్నం వేళ కాసేపు ఆలయం తలుపులు మూసి ఉంచినందుకే, సాయంత్రం దైవ దర్శనం చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతూ వుంటుంది. దైవ దర్శనం ఎప్పుడెప్పుడవుతుందా అనే ఒకరకమైన ఆరాటం వుంటుంది. అలాంటిది వారంలో ఒకరోజు మాత్రమే దైవాన్ని దర్శించుకోవలసి వస్తే, ఆ పరిస్థితి ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. అలా వారానికి ఒకరోజు మాత్రమే తలుపులు తెరవబడే ఆలయం మనకి ప్రకాశం జిల్లా 'మాల్యాద్రి'లో కనిపిస్తుంది.
కొండపై గల ఈ ఆలయం ఆరు రోజులపాటు మూసి వుంచి ఒకరోజు మాత్రమే తెరవడానికి ఒక మహిమాన్వితమైన కారణం వుందని స్థల పురాణం చెబుతోంది. ఈ ప్రదేశంలో తపస్సు చేసిన అగస్త్య మహర్షికి లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చాడు. అక్కడ ఆవిర్భవించి .. వారంలో ఆరు రోజుల పాటు దేవతలకు ... ఒకరోజు మాత్రమే మానవులకు దర్శనం ఇవ్వవలసిందిగా అగస్త్య మహర్షి స్వామిని కోరాడట. అందుకు స్వామి అంగీకరించడం వల్లనే ఈ నియమం కొనసాగుతూ వస్తోంది.
ప్రతి శనివారం రోజున మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు. అయితే ఆరు రోజులపాటు ఆలయాన్ని మూసి ఉంచకూడదని కొందరు ... ఒక రోజే ఆలయం తెరచి వుండటం వలన భక్తులకు ఇబ్బంది కలుగుతోందని కొందరు భావించారు. అగస్త్యుడు ... తపస్సు ... నియమం ... ఓ కట్టుకథంటూ ఆయా కాలాల్లో ఈ నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించారు. అలాంటి వారందరూ కూడా అనూహ్యమైన సంఘటనలను ఎదుర్కోవలసి వచ్చిందట.
తాము అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ... ఆపదలో చిక్కుకోవడానికి ... అనారోగ్యంపాలు కావడానికి కారణం తాము తీసుకున్న నిర్ణయమేననే విషయం వారి అనుభవంలోకి వచ్చింది. కొండపై స్వామి దర్శన నియమాన్ని మార్చడానికి ప్రయత్నించిన వాళ్ల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన వారికి విషయం భోదపడింది. దాంతో ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఈ విషయం గురించిన ఆలోచన తీసుకు రావడానికి కూడా ఇక్కడ ఎవరూ ఇష్టపడరు. ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని తప్పక దర్శించి తీరాలి.