దక్షిణ భారతదేశంలోని 6 నగరాల్లో తన సేవలను విస్తరించినట్లు ప్రకటించిన న్యూగో

Related image

  • హైదరాబాద్ - సూర్యాపేట - విజయవాడ మరియు బెంగళూరు - చిత్తూరు - తిరుపతి రూట్లలో కోచ్‌లు నడుస్తాయి
  • భద్రత, సమయపాలన, సౌలభ్యంతో 'ప్రీమియం ఎలక్ట్రిక్ ఏసి కోచ్' అనుభవాన్ని అందిస్తుంది
 
హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2022: భారతదేశపు మొట్టమొదటి ప్రీమియం ఎలక్ట్రిక్ ఇంటర్ సిటీ కోచ్ సర్వీసెస్ బ్రాండ్ అయిన న్యూగో, కర్ణాటక, తెలంగాణతో తన సేవలను ప్రారంభించి భారతదేశంలోని దక్షిణ ప్రాంతానికి విస్తరించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్-సూర్యాపేట-విజయవాడ, బెంగళూరు-చిత్తూరు-తిరుపతి రూట్లలో త్వరలోనే ఈ బోగీలు నడవనున్నాయి. గ్రీన్ సెల్ మొబిలిటీ వారి ప్రముఖ అంతర్ నగరమైన, భారతదేశవ్యాప్తంగా నడుస్తున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ కోచ్ బ్రాండే న్యూగో. నవతరం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని సురక్షితమైన, పర్యావరణ హాని లేని ప్రయాణాన్ని ధృవీకరిస్తూ, ఇంటర్-సిటీ ప్రయాణికులకు సులభమైన బుకింగ్ అనుభవాన్ని, అసాధారణమైన రైడ్ నాణ్యతతోపాటు ఇన్-క్యాబిన్ అనుభవాన్ని న్యూగో అందిస్తుంది.
 
హైదరాబాద్-సూర్యాపేట-విజయవాడ మార్గంలో బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్స్, మియాపూర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, లక్డీకాపూల్, ఎల్బీనగర్, హోటల్ సాయికృష్ణ (సూర్యాపేట), విజయవాడలోని పటమట, ఎన్టీఆర్ సర్కిల్, బెంజ్ సర్కిల్, హనుమాన్ పేట్, ఇబ్రహీంపట్నం స్టాపుల వద్ద బోర్డింగ్ పాయింట్లు ఉంటాయి. బెంగళూరు-చిత్తూరు తిరుపతి మార్గంలో మెజెస్టిక్, ఆనంద్ రావు సర్కిల్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, కేఆర్ పురం రైల్వే స్టేషన్, హోస్కోటే, కోలార్, పలమనేరు, తిరుపతిలు ప్రధాన బోర్డింగ్ పాయింట్లుగా ఉన్నాయి.
 
కస్టమర్ సెంట్రిక్ బ్రాండ్ అయిన న్యూగో కోచ్‌లను ప్రయాణానికి ముందు మెకానికల్, ఎలక్ట్రికల్ తనిఖీలు సహా 25 కఠినమైన భద్రతా తనిఖీలు చేస్తారు. ప్రతి ట్రిప్పుకు ముందు కోచ్‌లు శానిటైజ్ చేస్తారు, కోచ్ పైలట్‌లకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లు చేస్తారు. న్యూగో సేవలలో లైవ్ కోచ్ ట్రాకింగ్, డ్రాప్ పాయింట్ జియో-లొకేషన్, మానిటర్ ఇన్కో చ్ సిసిటివి నిఘా కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బోగీలు రద్దీ ట్రాఫిక్ పరిస్థితులలో ఎయిర్ కండిషనర్లను ఆన్ చేసిన స్థితిలో ఒకే ఛార్జ్‌లో 250 కిలోమీటర్లు వెళ్లగలవు.
 
న్యూగోకు బాగా శిక్షణ పొందిన, మర్యాదపూర్వకమైన సిబ్బంది ఉన్నారు, ఎంపిక చేయబడ్డ నగరాల్లో ప్రీమియం లాంజ్‌లను అందిస్తుంది, మరియు కస్టమర్ అసిస్ట్, లగేజీ మేనేజ్‌మెంట్ సర్వీస్‌లను అందిస్తుంది. దీనికి అదనంగా, ఆన్టై మ్ పనితీరుతో ఆన్ బోర్డ్ వద్ద మరియు లాంజ్‌ల వద్ద క్యూరేటెడ్ ఎఫ్ అండ్ బి మెనూ అందించబడుతుంది.
 
ఈ సందర్భంగా గ్రీన్ సెల్ మొబిలిటీ డైరెక్టర్ సతీష్ మంధాన మాట్లాడుతూ.. "దేశవ్యాప్తంగా అంతర్న గర మార్గాల్లో జీరో టెయిల్ పైప్ ఉద్గారాలతో స్థిరమైన ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించాలని న్యూగో లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణాది నగరాల్లో మా సేవలను ప్రారంభించడంతో మా అతిథులకు సంపూర్ణ ప్రయాణ అనుభవాన్ని అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.’’ అని చెప్పారు.
 
న్యూగో కోచ్‌లు సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానంతో ఫిట్ చేయబడతాయి, భద్రత, సమయపాలన, అంతరాయం లేని కస్టమర్ అనుభవంపై దృష్టి సారించడం ద్వారా అంతర్-నగర ప్రయాణికులకు పూర్తిస్థాయి సౌకర్యాన్ని అందిస్తాయి.
 

More Press Releases