Reliance Jio: జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. ఒక్క ప్లాన్‌తో ఏకంగా 15 ఓటీటీలు

Reliance Jio Launches Rs 888 Plan For Jio Fiber And Jio Air Fiber Users
  • రూ. 888తో పోస్టుపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన జియో
  • 30 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా
  • 800 డిజిటల్ టీవీ చానళ్లు కూడా 
  • ఈ నెల 31తో ముగియనున్న ఆఫర్
జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం రిలయన్స్ జియో మరో ఆకర్షణీయమైన ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 888తో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన జియో.. దాంతోపాటు 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను తీసుకొచ్చింది. కొత్త వినియోగదారులు మాత్రమే కాకుండా జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్లు కూడా ఈ ప్లాన్‌కు మారొచ్చని కంపెనీ తెలిపింది.

ఈ ప్లాన్‌లో యూజర్లకు 30 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా, బేసిక్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ వంటి 15 ఓటీటీ యాప్స్ లభిస్తాయి. వీటికి అదనంగా 800 డిజిటల్ టీవీ చానళ్లను చూడొచ్చు. ఐపీఎల్ ధన్‌ధనా ఆఫర్ కూడా దీనికి వర్తిస్తుంది. 50 రోజులపాటు జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ కస్టమర్లు ఉచితంగా ఈ సేవలు పొందవచ్చు. ఈ నెల 31తో ఆఫర్ ముగుస్తుంది.
Reliance Jio
OTT
Postpaid Offer

More Telugu News