భీమ‌వ‌రంలో మ‌ద్యం మ‌త్తులో యువ‌తి హ‌ల్‌చ‌ల్.. వీడియో వైర‌ల్‌

  • భీమవరం-పాలకొల్లు ప్రధాన రహదారిపై మ‌ద్యం తాగి అడ్డంగా ప‌డుకున్న యువ‌తి
  • ఎవ‌రెంత చెప్పినా ఆమె అక్క‌డి నుంచి క‌ద‌ల‌ని యువ‌తి
  • దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే అలా ప‌డుకుని ట్రాఫిక్‌కు అంత‌రాయం 
  • చివ‌ర‌కు పోలీసులు క‌ల‌గ‌జేసుకుని ఆమెను ప‌క్క‌కు తీసుకెళ్లిన వైనం
భీమవరంలో ఓ యువతి మద్యం మత్తులో హల్ చల్ చేసింది. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పూటుగా మద్యం తాగి రహదారికి అడ్డంగా యువ‌తి పడుకుంది. భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారిపై ఫుల్‌గా మ‌ద్యం తాగి వాహ‌నాల‌కు అడ్డంగా ప‌డుకుంది. ఎవ‌రెంత చెప్పినా ఆమె స‌సేమిరా అక్క‌డి నుంచి క‌ద‌ల్లేదు. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. 

దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే అలా ప‌డుకుని ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగించింది. చివ‌ర‌కు పోలీసులు క‌ల‌గ‌జేసుకుని ఆమెను ప‌క్క‌కు తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌తో వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు తీవ్ర అసౌక‌ర్యానికి గురయ్యారు. కాగా, ఆ యువ‌తి ఎవ‌రు, ఎక్క‌డి నుంచి వ‌చ్చారు అనే వివ‌రాలు తెలియ‌రాలేదు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు. 


More Telugu News