శ్రీవారి సేవ‌లో త‌మ‌న్, గోపీచంద్ మ‌లినేని

   
తిరుమ‌ల స్వామివారిని ఈరోజు సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌, ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని, యువ న‌టుడు అశ్విన్ బాబు ద‌ర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ ద‌ర్శ‌న స‌మ‌యంలో శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారికి టీటీడీ అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌న అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో అర్చ‌కులు వేదాశీర్వ‌చ‌నం చేసి, స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారితో అభిమానులు ఫొటోలు దిగేందుకు ప్ర‌య‌త్నించారు. 






More Telugu News