రేపు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ

  • వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ బెంగాల్ లో హింసాత్మక ఘటనలు
  • బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్‌పీ డిమాండ్
  • అన్ని రాష్ట్రాల్లోని వీహెచ్‌పీ సభ్యులు, మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు
రేపు దేశ వ్యాప్త సమ్మెకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) పిలుపునిచ్చింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ముర్షిదాబాద్ అల్లర్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలను వీహెచ్‌పీ ఖండించింది. బెంగాల్ లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. 

బెంగాల్ హింసాత్మక ఘటనలకు వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాల్లోని వీహెచ్‌పీ సభ్యులు, మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. బెంగాల్ లో ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు మెమోరాండం సమర్పించాలని చెప్పారు.


More Telugu News