వామ్మో.. తార‌క్‌ ధ‌రించిన ఆ చొక్కా ఖ‌రీదెంతో తెలిస్తే షాక్ అవ్వ‌డం ఖాయం!

  • ఇటీవ‌ల‌ దుబాయ్ టూర్‌కి వెళ్లిన ఎన్‌టీఆర్‌
  • అక్క‌డ తార‌క్‌ను క‌లిసిన‌ కొంద‌రు ఫ్యాన్స్‌ 
  • వారితో క‌లిసి ఫొటోలు దిగిన యంగ్‌టైగ‌ర్
  • ఆ స‌మ‌యంలో ఆయ‌న వేసుకున్న పూల చొక్కా ఖ‌రీదుపై ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌
  • ‘ఎట్రో’ అనే బ్రాండ్ కు చెందిన ఆ చొక్కా ఖ‌రీదు అక్ష‌రాల రూ.85వేలు
యంగ్‌టైగ‌ర్ ఎన్‌టీఆర్‌ త‌న కుటుంబంతో క‌లిసి ఇటీవ‌ల‌ దుబాయ్ టూర్‌కి వెళ్లారు. అక్క‌డ స‌ర‌దాగా చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఈ క్ర‌మంలోనే తార‌క్‌ను అక్క‌డ కొంద‌రు ఫ్యాన్స్‌ క‌లిశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌ చాలా సింపుల్‌గా కనిపించే నీలిరంగు పూల చొక్కా ధరించారు. చూడ్డానికి ఆ చొక్కా సింపుల్‌గానే క‌నిపిస్తున్నా దాని ఖ‌రీదు తెలిసి అంద‌రూ షాకవుతున్నారు. 

‘ఎట్రో’ అనే బ్రాండ్ కు చెందిన ఆ చొక్కా ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా... దాని ధ‌ర‌ దాదాపుగా రూ. 85 వేల వరకు ఉంటుందని అంచనా. ఒక్క చొక్కాకి తార‌క్‌ అంత డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు. ఏదేమైనా ఆయ‌న‌ రేంజే వేరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక తార‌క్ సినిమాల విషయానికి వ‌స్తే... ఇటీవ‌లే బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ -2' షూటింగ్ పూర్తి చేశారు. ఈ నెల 22 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఆ త‌ర్వాత కొర‌టాల శివ‌తో 'దేవర-2'లో న‌టించ‌నున్నారు. 


More Telugu News