Ameesha Patel: అది నా ఫోన్ నెంబరు కాదు... ఆ వ్యక్తి ఒక మోసగాడు: అమీషా పటేల్

Ameesha Patel Warns Fans About Fake Phone Number Fraud
  • తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఫోన్ నంబర్ ఫేక్ అని చెప్పిన అమీషా
  • మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అభిమానులను హెచ్చరిక
  • ‘హమ్‌రాజ్ 2’ సీక్వెల్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా
  • నిర్మాతలు ఈ సీక్వెల్‌పై చాలా ఉత్సాహంగా ఉన్నారని వెల్లడి
బాలీవుడ్ నటి అమీషా పటేల్ తన అభిమానులను, నెటిజన్లను అప్రమత్తం చేశారు. తన పేరుతో ఓ నకిలీ ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని, దాని బారిన పడి మోసపోవద్దని హెచ్చరించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తన పేరు వాడుకుంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ ఫేక్ నంబర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను అమీషా షేర్ చేశారు. "ఈ నంబర్ నకిలీది. ఈ వ్యక్తి ఒక మోసగాడు. దయచేసి దీన్ని నమ్మవద్దు. ఇది నేను కాదు" అని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి మోసగాళ్ల నుంచి తమ డేటాను, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, ఇటీవల 'గదర్ 2' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న అమీషా.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హమ్‌రాజ్ 2’ సీక్వెల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ‘హమ్‌రాజ్’ సినిమాకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉందని, కాబట్టి దాని సీక్వెల్ కచ్చితంగా మంచి బిజినెస్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నటీనటుల కంటే నిర్మాతలు ఈ సీక్వెల్‌పై చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆమె తెలిపారు.

గతేడాది జూలైలో అమీషా తన సహనటులు బాబీ డియోల్, అక్షయ్ ఖన్నాలతో కలిసి దిగిన ‘హమ్‌రాజ్’ ప్రమోషన్స్ నాటి ఫొటోను పోస్ట్ చేయడంతో సీక్వెల్ వార్తలు మళ్లీ ఊపందుకున్న విషయం తెలిసిందే.
Ameesha Patel
Ameesha Patel fraud
Ameesha Patel fake number
Gadar 2
Humraaz 2
Bollywood actress
social media fraud
cyber crime
Bobby Deol
Akshay Khanna

More Telugu News