Virat Kohli: ఐదేళ్ల తర్వాత మళ్లీ 'టాప్' లేపిన కోహ్లీ

Virat Kohli Reclaims Top Spot in ICC ODI Rankings After 5 Years
  • ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ నవ్ స్థానానికి విరాట్ కోహ్లీ
  • రోహిత్ శర్మను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
  • కోహ్లీకి ఒక్క పాయింట్ దూరంలో రెండో స్థానంలో డారిల్ మిచెల్
  • బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి ఎగబాకిన మహమ్మద్ సిరాజ్
  • టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు నంబర్ వన్ స్థానంలో ఉన్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి కింగ్ కోహ్లీ సింహాసనాన్ని అధిరోహించాడు. రోహిత్ శర్మ మూడో స్థానానికి పడిపోయాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 91 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రదర్శనతో కోహ్లీకి ఈ అగ్రస్థానం దక్కింది. దాదాపు ఐదేళ్ల తర్వాత, అంటే 2021 జూలై తర్వాత కోహ్లీ తిరిగి నంబర్ వన్ ర్యాంకును అందుకోవడం విశేషం. తన కెరీర్‌లో ఇప్పటివరకు 825 రోజుల పాటు కోహ్లీ నంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్, కోహ్లీకి కేవలం ఒక్క పాయింట్ దూరంలో రెండో స్థానంలో నిలిచాడు.

ఇక బౌలర్ల విషయానికొస్తే, భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఐదు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు.

ఇతర ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. యాషెస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ రెండో స్థానానికి ఎగబాకగా, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా తిరిగి నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు.
Virat Kohli
ICC rankings
ODI rankings
Rohit Sharma
Daryl Mitchell
Mohammad Siraj
Travis Head
Wanindu Hasaranga
Sikandar Raza
Cricket

More Telugu News