ల‌క్నోపై టాస్ గెలిచిన ముంబ‌యి... గాయం కార‌ణంగా మ్యాచ్‌కు రోహిత్ దూరం!

  • ల‌క్నో వేదిక‌గా ఎంఐ, ఎల్ఎస్‌జీ మ్యాచ్‌
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబ‌యి
  • ప్రాక్టీస్‌లో గాయ‌ప‌డి మ్యాచ్‌కు దూర‌మైన హిట్‌మ్యాన్
ల‌క్నో వేదిక‌గా ముంబ‌యి ఇండియ‌న్స్‌ (ఎంఐ), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ 16వ మ్యాచ్‌లో మొద‌ట టాస్ గెలిచిన ముంబ‌యి కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శ‌ర్మ ప్రాక్టీస్ సంద‌ర్భంగా గాయ‌ప‌డ‌డంతో ఈ మ్యాచ్‌కు దూర‌మైన‌ట్లు హార్దిక్ వెల్లడించాడు. అలాగే ల‌క్నో జ‌ట్టులోకి మీడియం పేస‌ర్ ఆకాశ్ దీప్‌ను తీసుకున్న‌ట్లు కెప్టెన్ పంత్‌ తెలిపాడు. ఎం. సిద్ధార్థ్ స్థానంలో అత‌డు జ‌ట్టులోకి వ‌చ్చాడు. 

ఇక ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఈ రెండు జ‌ట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో ఇరు జ‌ట్లు కేవ‌లం ఒక్కో మ్యాచ్ మాత్ర‌మే గెలిచాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ముంబ‌యి ఆరో స్థానంలో ఉంటే... ల‌క్నో ఏడో స్థానంలో ఉంది.  దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో పైకి వెళ్లాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. 

లక్నో సూపర్ జెయింట్స్ జ‌ట్టు: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్ (కెప్టెన్, వికెట్ కీప‌ర్), బదోని, మిల్లర్, సమద్, శార్ధూల్‌ ఠాకూర్, దిగ్వేశ్‌, ఆకాశ్‌ దీప్, అవేశ్ ఖాన్‌
ఇంపాక్ట్ సబ్స్: ర‌వి బిష్ణోయ్, ప్రిన్స్, షాబాజ్, సిద్దార్థ్, ఆకాశ్

ముంబై ఇండియన్స్ జ‌ట్టు: జాక్స్, రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), ధీర్, సూర్యకుమార్, హార్దిక్ (కెప్టెన్), బవా, సాంట్నర్, చాహర్, బౌల్ట్, అశ్వని, పుత్తూరు
ఇంపాక్ట్ సబ్స్: తిలక్ వ‌ర్మ‌, బాష్, మింజ్, స‌త్య‌నారాయ‌ణ‌ రాజు, కర్న్  


More Telugu News