సన్ రైజర్స్ ఆరోపణలపై స్పందించిన హెచ్‌సీఏ

  • మ్యాచ్ పాస్ ల కోసం ఒత్తిడి చేస్తున్నారంటూ హెచ్‌సీఏపై సన్ రైజర్స్ ఆరోపణ
  • హెచ్‌సీఏ అధ్యక్షుడు బెదిరిస్తున్నారని వెల్లడి
  • ఈ నెల 29న సన్ రైజర్స్ ఈ-మెయిల్ కు బదులిచ్చామన్న హెచ్‌సీఏ
ఐపీఎల్ మ్యాచ్ పాస్ ల కోసం తమను ఒత్తిడి చేస్తోందంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని సన్ రైజర్స్ తన ఈ-మెయిల్ లో పేర్కొంది. ఉప్పల్ స్టేడియంలో ఓ మ్యాచ్ సందర్భంగా వీఐపీ బాక్స్ కు తాళం వేసుకున్నారని వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో, సన్ రైజర్స్ ఆరోపణలపై హెచ్‌సీఏ స్పందించింది. ఈ నెల 29న ఈ-మెయిల్ ద్వారా సన్ రైజర్స్ ఆరోపణలకు సమాధానం ఇచ్చామని వెల్లడించింది. సన్ రైజర్స్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు వ్యక్తిగతంగా టికెట్లు అడగలేదని, కేవలం క్లబ్ కార్యదర్శుల కోసమే టికెట్లు అడిగారని వివరణ ఇచ్చింది.


More Telugu News