సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వాన్ గార్డ్ సంస్థ సీఈవో, ప్రతినిధులు

  • హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వాన్ గార్డ్ సీఈవో వెల్లడి
  • దేశంలోనే తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో స్థాపించనున్నట్లు వెల్లడి
  • 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న సీఈవో
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వాన్ గార్డ్ సంస్థ సీఈవో సమావేశమయ్యారు. అనంతరం సీఈవో మరియు కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే మొట్టమొదటి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో స్థాపించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే దాదాపు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజినీరింగ్ రంగాల్లో నిపుణులకు తమ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయని వాన్ గార్డ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాల వల్లే హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండా, అన్ని రంగాల నిపుణులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నారని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ కేపబులిటీ సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.


More Telugu News