Donald Trump: మిత్రుల మధ్య విభేదాలు సహజమే.. అందుకే ట్రంప్-మోదీ మధ్య దూరం!: అమెరికా రాయబారి

Trump and Modi have differences says US Ambassador
  • ట్రంప్, మోదీ మధ్య స్నేహబంధం నిజమైందేనన్న అమెరికా రాయబారి
  • ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద దేశమన్న సెర్గియో గోర్
  • రెండు దేశాల సత్సంబంధాలకు వాణిజ్యం చాలా కీలకమని వ్యాఖ్య
తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య స్నేహబంధం నిజమైందేనని భారత్‌కు నూతన అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్ పేర్కొన్నారు. నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు సహజమని, ట్రంప్, మోదీల మధ్య విభేదాలు కూడా అలాంటివేనని అన్నారు. వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగడానికి వారు ప్రయత్నిస్తారని తెలిపారు. 

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద దేశమని, రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు వాణిజ్యం చాలా కీలకమని గోర్ అభిప్రాయపడ్డారు.

వీలైనంత త్వరగా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాల ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. భద్రత, సాంకేతికత, ఆరోగ్యం, ఇంధనం వంటి రంగాల్లో కూడా రెండు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని అన్నారు. భారతదేశమే తమకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

వాణిజ్య ఒప్పందానికి సంబంధించి జనవరి 13న ఇరు దేశాల ప్రతినిధులు మరోసారి సమావేశం కానున్నట్లు సెర్గియో గోర్ వెల్లడించారు. 
Donald Trump
Narendra Modi
India US relations
Sergio Goor
US Ambassador to India
India trade deal

More Telugu News