Prabhas: ప్రభాస్ 'ది రాజాసాబ్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఇవే!
- మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ది రాజాసాబ్'
- మూడు రోజులకు రూ. 183 కోట్ల గ్రాస్ కలెక్షన్
- సంక్రాంతి సెలవుల్లో జోరు మరింత పెరిగే అవకాశం
'బాహుబలి'తో ఇండియన్ సినిమా దిశను మార్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా దూసుకెళుతున్నాడు. తాజాగా, మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ది రాజాసాబ్' హారర్-కామెడీ ఫాంటసీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైండ్ గేమ్‌లు, ఛాలెంజింగ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా జనవరి 9 విడుదలైంది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ... కలెక్షన్ల పరంగా మాత్రం బాగుందనే చెప్పుకోవాలి.
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజులకు (ఫస్ట్ వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా రూ. 183 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు సెలవులు మొదలైనందున జోరు మరింత పెరిగి, రాబోయే రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
