ఉప ఎన్నికలు రాబోవన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్

  • తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయన్న కౌశిక్ రెడ్డి
  • సుప్రీంకోర్టు మీద పూర్తి నమ్మకముందన్న పాడి కౌశిక్ రెడ్డి
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ధీమా
తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోవన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. రావని చెప్పడానికి ఇది రేవంత్ రెడ్డి జాగీరు కాదని విమర్శించారు. సుప్రీంకోర్టు మీద తమకు పూర్తి నమ్మకం ఉందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాత్రమే రైతుల సంక్షేమం కోసం పని చేశారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు చాలా చక్కగా ఉండేవని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మీద ఏడవడం మానివేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.


More Telugu News