Viral Video: చిన్నారిపై మాజీ జిమ్ ట్రైనర్ దాష్టీకం.. ఘటనపై నివేదిక కోరిన బాలల కమిషన్

Ranjan Bengaluru Gym Trainer Assaults Child CCTV Footage Surfaces
  • రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన మాజీ జిమ్ ట్రైనర్
  • నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసిన పోలీసులు
  • గతంలోనూ పలువురు చిన్నారులపై దాడి చేసినట్లు సీసీటీవీలో రికార్డ్
  • ఘటనపై సీరియస్ అయిన బాలల హక్కుల కమిషన్.. నివేదికకు ఆదేశం
బెంగళూరులోని త్యాగరాజనగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై ఆడుకుంటున్న ఓ చిన్నారిపై రంజన్ అనే మాజీ జిమ్ ట్రైనర్ విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలుడిని కాలితో బలంగా తన్నడంతో అతని శరీరం, చేతులపై గాయాలయ్యాయి. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు బనశంకరి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితుడు రంజన్ గతంలోనూ ఆ ప్రాంతంలోని పలువురు చిన్నారులపై ఇలాగే దాడులకు పాల్పడినట్లు ఫుటేజీలో స్పష్టంగా క‌నిపించింది. ఉద్దేశపూర్వకంగానే పిల్లలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు దృశ్యాల ద్వారా తెలుస్తోంది. పోలీసులు నిందితుడిపై సెక్షన్ బీఎన్ఏ 115/2 కింద కేసు నమోదు చేశారు.

తీవ్రంగా స్పందించిన బాలల కమిషన్
ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ అధ్యక్షుడు శశిధర్ కొసాంబే మాట్లాడుతూ, పిల్లలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే హక్కు ఉందని, వారిపై ఇలాంటి దాడులు మానసిక ఎదుగుదలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమిషన్‌లో ఫిర్యాదు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఇప్పటికే ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్, నిందితుడిపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై పూర్తి నివేదిక సమర్పించాలని దక్షిణ డివిజన్ డీసీపీని ఆదేశించింది. ఈ ఘటనతో బహిరంగ ప్రదేశాల్లో పిల్లల భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Viral Video
Ranjan
Bengaluru gym trainer
child assault
CCTV footage
child rights commission
Shashidhar Kosambe
Banashankari police
child safety
Karnataka
crime

More Telugu News