గుంటూరు మేయ‌ర్ మ‌నోహ‌ర్‌ నాయుడు రాజీనామా

  • ఏడాది పదవీకాలం ఉండగానే రాజీనామా 
  • 2021లో వైసీపీ నుంచి మేయర్‌గా ఎన్నికైన మనోహర్‌ నాయుడు
  • గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మధ్య వివాదం 
గుంటూరు మేయ‌ర్, వైసీపీ నేత కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2021లో మేయ‌ర్‌గా ఎన్నికైన మ‌నోహ‌ర్, ఏడాది ప‌ద‌వీకాలం ఉండ‌గానే రాజీనామా చేశారు. కాగా, గ‌త నెల‌లో జ‌రిగిన గుంటూరు న‌గ‌ర‌పాల‌క స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో ఆరు స్థానాల‌ను టీడీపీ, జ‌న‌సేన కార్పొరేట‌ర్లు కైవ‌సం చేసుకున్నారు. 

అటు, వైసీపీ నుంచి కార్పొరేట‌ర్లు కూట‌మిలో చేర‌డంతో వైసీపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. ఈ నెల 17న స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో మ‌నోహ‌ర్ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. ఈ నేప‌థ్యంలో మ‌రో ఏడాది ప‌ద‌వీకాలం ఉండ‌గానే ఆయ‌న‌ రాజీనామా చేశారు. 


More Telugu News