కోహ్లీ సెంచరీ మిస్.. అయినా రికార్డుల బ్రేక్

  • ఆస్ట్రేలియాపై కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్
  • సెంచరీ మిస్ అయినా పలు రికార్డుల బ్రేక్ 
  • సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. విజయంలో కీలక పాత్ర పోషించిన మాజీ సారథి విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 5 ఫోర్లతో 84 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కోహ్లీ బ్యాట్ నుంచి మరో సెంచరీ రాబోతోందని ఆశగా ఎదురు చూసిన అభిమానులు శతకం చేజారడంతో నిరాశ చెందారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ తాను సెంచరీలు, రికార్డుల గురించి ఆలోచించనని, వాటికంటే విజయం ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా, కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌తో పలు రికార్డులు అతడి ఖాతాలోకి వచ్చి చేరాయి. 

  • ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సార్లు (24) 50కిపైగా పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. సచిన్ 58 ఇన్నింగ్స్‌లలో 23 సార్లు 50కి పైగా పరుగులు సాధించాడు. కోహ్లీ 53 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత అందుకున్నాడు.
  • ప్రపంచకప్, టీ20 వరల్డ్ కప్, టెస్ట్ చాంపియన్‌షిప్, చాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగానూ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 1023 పరుగులు ఉన్నాయి.
  • చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (701) రికార్డును అధిగమిస్తూ 746 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో విండీస్ దిగ్గజం క్రిస్‌గేట్ (791) అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
  • ఇక వన్డేల్లో చేజింగ్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత 8 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు.


More Telugu News