: తెలంగాణకు అడ్డుపడుతోంది నాయకులే: వీహెచ్
ప్రత్యేక తెలంగాణకు అడ్డుతగులుతోంది నాయకులే అని రాజ్యసభ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. నిజాం కళాశాలలో ఆరంభమైన తెలంగాణ రాష్ట్ర సాధన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగిస్తూ, తెలంగాణ వస్తుందనుకుంటున్న తరుణంలో రాజకీయనాయకులు ప్రజలను, విద్యార్థులను రెచ్చగొడుతూ పరిస్థితిని జటిలం చేస్తున్నారని విమర్శించారు. తాజాగా తెలంగాణను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు మళ్ళీ పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అన్నదమ్ముల్లా విడిపోదామని వీహెచ్ సూచించారు. ఇక కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించిన తర్వాత ప్రత్యర్థి పార్టీలో ఎవరూ మిగలరని జోస్యం చెప్పారు.