: పాలకొల్లులో ఆకట్టుకుంటున్న భారతీయడు, తెలుగోడు ఫ్లెక్సీ!
ఈమధ్య కాలంలో అభిమానాన్ని చాటుకునేందుకు అందరూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మరి కొంతమంది సామాజిక బాధ్యతను చాటేందుకు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి తమ చైతన్యాన్ని చాటుకుంటున్నారు. తాజాగా పాలకొల్లులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందర్నీ ఆకట్టుకుంటోంది. భక్తులతో పూజలందుకున్న గంగాదేవి ఉగ్రరూపాన్ని దాల్చి హిమగిరుల్ని మృత్యుకుహరాలుగా మారిస్తే బాధితులను అహర్నిశలూ కాపాడేందుకు దీక్షబూనిన సైనికులు ఓ ప్రక్క, తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు చేసిన చంద్రబాబు నాయుడు మరో ప్రక్క ఉండేట్టుగా నిమ్మల రామానాయుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంటోంది. దీనిపై వున్న 'భారత జాతికి సైనికులు అండ, తెలుగు జాతికి చంద్రబాబు అండ' అన్న స్లోగన్ కూడా ఆకట్టుకుంటోంది.