: వెస్టిండీస్ లో టీమిండియాకు ఘన స్వాగతం

ముక్కోణపు టోర్నీలో పాల్గొనేందుకు వెస్టిండీస్ బయల్దేరిన భారత జట్టుకు జమైకాలో ఘన స్వాగతం లభించింది. నిన్న లండన్ నుంచి పయనమైన టీమిండియా భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం కరీబియన్ గడ్డపై కాలుమోపింది. ఈమేరకు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్లో వెల్లడించాడు. విమానం దిగగానే జమైకా క్రికెట్ ఫ్యాన్స్ తోపాటు దేదీప్యమానంగా వెలుగుతున్న భానుడు తమకు హార్దిక స్వాగతం పలికాడని ట్వీటాడు. అంతేగాకుండా.. హోటల్ కు వెళ్ళే దారిలో స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్ హోర్డింగ్ లు భారీగానే దర్శనమిచ్చాయని తెలిపాడు అశ్విన్. కాగా, భారత్, విండీస్, శ్రీలంక జట్లు పాల్గొనే ఈ ట్రయాంగ్యులర్ టోర్నీ ఈ నెల 28న ఆరంభం కానుంది.

More Telugu News