పులివెందుల ర్యాలీలో ఉద్రిక్తత.. జగన్‌కు ఎదురుపడి నినాదాలు చేసిన దస్తగిరి!
Advertisement
- పులివెందులలో జగన్ ర్యాలీకి ఎదురెళ్లిన దస్తగిరి
- జగన్‌ను అడ్డుకుని సంచలన ఆరోపణలు
- సొంత బాబాయ్‌ను చంపించావంటూ నినాదాలు
- దస్తగిరిని పక్కకు తప్పించిన పోలీసులు
- చూసీ చూడనట్టుగా ముందుకు సాగిన జగన్
Advertisement
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు తన సొంత నియోజకవర్గం పులివెందులలో ఊహించని పరిణామం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన చేపట్టిన ర్యాలీలో, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎదురుపడి, సంచలన ఆరోపణలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో జగన్ పులివెందుల వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో దస్తగిరి అకస్మాత్తుగా ర్యాలీకి ఎదురుగా వచ్చాడు. అతడిని గమనించిన వైసీపీ కార్యకర్తలు, 'దస్తగిరి వచ్చాడు' అంటూ జగన్‌ను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.
అంతలోనే దస్తగిరి, జగన్ కాన్వాయ్ ముందుకొచ్చి.. "సొంత బాబాయ్ వివేకాను చంపించి మా జీవితాలు నాశనం చేశావ్" అంటూ గట్టిగా నినదించాడు. ఈ క్రమంలోచ దస్తగిరి మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే అతడిని అడ్డుకుని పక్కకు లాగేశారు. అనంతరం జగన్, దస్తగిరిని చూసీ చూడనట్టుగా తన ర్యాలీలో ముందుకు సాగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.