టీ20 చరిత్రలో సరికొత్త రికార్డ్.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్
Advertisement
- అంతర్జాతీయ టీ20ల్లో 200 వికెట్లు తీసిన రషీద్ ఖాన్
- జింబాబ్వేతో మ్యాచ్‌లో అరుదైన మైలురాయిని అందుకున్న ఆఫ్ఘన్ స్పిన్నర్
- 120వ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించిన రషీద్
- ఈ జాబితాలో 171 వికెట్లతో రెండో స్థానంలో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్
Advertisement
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అఫ్ఘనిస్థాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20ల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం షార్జా వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రషీద్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదన ప్రారంభించిన జింబాబ్వే 202 పరుగులకే పరిమితమైన ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 9వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్.. ఓపెనర్ తడివానషే మరుమనిని (2) ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఇది అంతర్జాతీయ టీ20ల్లో అతడికి 200వ వికెట్ కావడం విశేషం. కేవలం 120 మ్యాచ్‌లలోనే రషీద్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత 153 మ్యాచ్‌లలో 171 వికెట్లతో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ రెండో స్థానంలో ఉన్నాడు. హాంగ్ కాంగ్ బౌలర్ ఎహసాన్ ఖాన్, న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధీ (ఇద్దరూ 165 వికెట్లు), న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ (164 వికెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రషీద్ తన టీ20 కెరీర్‌లో 13.96 సగటుతో, 6.13 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. ఇందులో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉండగా, ఒకసారి 3 పరుగులకే 5 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలు నమోదుచేశారు. గత ఏడాది వన్డేల్లోనూ 200 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి ఆఫ్ఘన్ బౌలర్‌గా రషీద్ నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్థాన్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (50 బంతుల్లో 116) అద్భుత శతకంతో భారీ స్కోరు సాధించింది. చివర్లో కెప్టెన్ రషీద్ ఖాన్ కేవలం 6 బంతుల్లో 4 సిక్సర్లతో 25 పరుగులు చేసి జట్టు స్కోరును 221కి చేర్చాడు. అనంతరం జింబాబ్వే 202 పరుగులకే పరిమితం కావడంతో అఫ్ఘనిస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.