Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

YS Avinash Reddy arrested amid high tension in Andhra Pradesh
Advertisement
  • పరిషత్ ఎన్నికల నామినేషన్ల వేళ కడపలో తీవ్ర ఉద్రిక్తత
  • పులివెందుల వెళ్తుండగా మార్గమధ్యంలో అరెస్ట్ 
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని పోలీసుల హెచ్చరిక
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల పర్వం అగ్గి రాజేస్తోంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన నాటి నుంచే మొదలైన ఉద్రిక్తతలు ఈరోజు తార స్థాయికి చేరాయి. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని పోలీసులు కాసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో కడప జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి భగ్గుమంది.

అసలేం జరిగింది?
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్తతలు తలెత్తవచ్చని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో, కడప నుంచి పులివెందులకు బయలుదేరిన ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తదితరులను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పులివెందులకు వెళ్లరాదని సూచించారు.

అయితే, తమ నియోజకవర్గానికి తాము వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని ఎంపీ అవినాశ్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో... శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ముందస్తు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి, అవినాశ్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ... "ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న పక్కా సమాచారంతోనే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాం. ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఘర్షణలకు ఆస్కారం ఇస్తే ఉపేక్షించేది లేదు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరపడమే మా లక్ష్యం. ఇందులో భాగంగానే నేతలను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది" అని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement
YS Avinash Reddy
Pulivendula
AP Local Body Elections
YSRCP
Kadapa Police
Andhra Pradesh Politics

More Telugu News