Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డబ్బుల్లేవని.. లోన్‌ తీయించి మరీ దోచుకున్న దొంగలు!

Thieves rob man by making him take mobile app loan as he had no cash
Advertisement
  • చెన్నైలో 21 ఏళ్ల యువకుడిని కిడ్నాప్‌ చేసిన నలుగురు దొంగలు
  • డబ్బుల్లేవని చెప్పడంతో అతడిపై దాడి
  • మొబైల్‌ యాప్‌లో లోన్‌ తీసుకోవాలని బలవంతం
  • ఏటీఎం నుంచి రూ.9,500 నగదు తీసుకుని పరార్‌
  • బాధితుడి సెల్‌ఫోన్‌ను కూడా లాక్కెళ్లిన వైనం
Advertisement
చేతిలో డబ్బులు లేవని చెబితే వదిలేయాలి. కానీ చెన్నైలో ఓ దొంగల ముఠా అలా చేయలేదు. ఓ యువకుడిని కిడ్నాప్‌ చేసి, అతడి దగ్గర డబ్బుల్లేవని తెలిసి మొబైల్‌ యాప్‌లో అప్పు తీసుకునేలా చేసింది. ఆ డబ్బులను ఏటీఎం నుంచి తీసుకుని, అతడి ఫోన్‌ కూడా లాక్కెళ్లింది. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నైలోని పల్లికరణై ప్రాంతంలో అజయ్‌ (21) అనే యువకుడిని నలుగురు వ్యక్తులు ఆటోరిక్షాలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. తన దగ్గర డబ్బుల్లేవని అజయ్‌ చెప్పడంతో అతడిపై దాడి చేశారు. మొబైల్‌ యాప్‌లో రుణం తీసుకోవాలని బెదిరించారు. రుణం మంజూరైన తర్వాత అజయ్‌ను ఏటీఎం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రూ.9,500 నగదు తీసుకున్నారు. అనంతరం అతడి సెల్‌ఫోన్‌ను కూడా లాక్కుని వెళ్లిపోయారు.

బాధితుడి ఫిర్యాదుతో పల్లికరణై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెన్నైకి చెందిన సాయి అబూతకీర్‌ అలియాస్‌ అబు (18), ప్రకాశ్‌ రాజ్‌ (22), పూబాలన్‌ (23), సంజయ్‌ (21) ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. నలుగురినీ అరెస్టు చేసి, నేరానికి ఉపయోగించిన ఆటోరిక్షాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement
Chennai Police
Mobile App Loan Robbery
Pallikaranai Kidnapping Case
Chennai Crime News
Online Loan Fraud
Auto Rickshaw Gang Arrest

More Telugu News