Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీరు జెన్ జీ కాదు: సీజేపీ నేతలతో ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

You are not Gen Z Delhi High Court interesting comments to CJP leaders
Advertisement
  • జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై పిటిషన్
  • పిటిషనర్లు జెన్ Z కాదంటూ న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
  • హైకోర్టు సూచనతో పిటిషన్ వాపస్ తీసుకున్న సీజేపీ నేతలు
Advertisement
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా తమ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం వెనక్కి తీసుకున్నారు. ప్రత్యామ్నాయ న్యాయపరమైన మార్గాలు అందుబాటులో ఉండగా నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ధర్మాసనం ప్రశ్నించడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన కేసులో అరెస్టయిన సౌరవ్ దాస్ (27), అశుతోష్ రంకా (32) జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అక్టోబర్ 19న మరో రెండు రోజులు పొడిగించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్ల వయసు గురించి న్యాయవాది చెప్పగా, 'అయితే మీరు జెన్ జీ కాదు' అని అన్నారు. రివిజన్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నప్పుడు, ఆర్టికల్ 226 కింద నేరుగా హైకోర్టుకు రావడంపై ఆయన ప్రశ్నించారు. "ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుని, మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ ఫలితం కోసం వేచి చూడటం మంచిది" అని ధర్మాసనం సూచించింది. హైకోర్టు సూచనను పరిగణనలోకి తీసుకున్న పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో వారి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
Advertisement
Advertisement
Sourav Das
Ashutosh Ranka
Delhi High Court
Cockroach Janata Party
Jantar Mantar protest
Judicial custody challenge

More Telugu News