Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా నుంచి తిరిగివస్తున్న ఐటీ నిపుణులు.. ప్రధాని మోదీకి విజయసాయి రెడ్డి కీలక విజ్ఞప్తి!

IT professionals returning from USA Vijayasai Reddys key request to PM Modi
Advertisement
  • ఇప్పటికే యూఎస్ నుంచి 12,700 మంది ఇండియాకు తిరిగొచ్చారన్న విజయసాయి
  • ఇది మేధో సంపద తిరిగి రావడమేనని వ్యాఖ్య
  • ఈ మేధో సంపదను సరైన రీతిలో ఉపయోగించుకోవాలని సూచన
Advertisement
అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న ఐటీ నిపుణుల ప్రతిభను దేశాభివృద్ధికి సమర్థంగా వినియోగించుకోవాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన నూతన విధానాల కారణంగా ఇప్పటికే 12,700 మందికి పైగా భారతీయ ఐటీ నిపుణులు స్వదేశానికి తిరిగి వచ్చారని, ఈ సంఖ్య ఇంకా పెరుగుతోందని విజయసాయి రెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు. ఇది కేవలం రివర్స్ మైగ్రేషన్ కాదని, ఎంతో విలువైన ప్రపంచ స్థాయి అనుభవం, మేధో సంపద తిరిగిరావడంగా చూడాలని ఆయన అన్నారు.

ఈ పరిణామం భారత్‌కు ఒక గొప్ప అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒక వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలని కోరారు. తిరిగి వస్తున్న నిపుణులకు ప్రపంచ స్థాయి దేశీయ కంపెనీలను స్థాపించి, నడిపించే సత్తా ఉందని విజయసాయి రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే క్రమంలో వీరు విలువైన ఆస్తిగా మారతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేధో సంపదను సరైన మార్గంలో ఉపయోగించుకుని, భారత సాంకేతిక ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చాలని ఆయన సూచించారు.
Advertisement
Advertisement
Vijayasai Reddy
Narendra Modi
IT professionals
Donald Trump
Reverse migration
Indian IT experts

More Telugu News