ప్రజాస్వామ్యంపై మీరు నీతులు చెప్పడమా?: జగన్కు అచ్చెన్నాయుడు కౌంటర్
Advertisement
- జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు
- 2020 స్థానిక ఎన్నికల్లో జరిగిన దాడులకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్
- నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం తగ్గింపు ఆర్డినెన్స్ను గుర్తు చేసిన మంత్రి
- బెదిరింపుల వల్లే నాడు ఎన్నికలను బహిష్కరించాల్సి వచ్చిందని వెల్లడి
- ఎన్నికల హింసపై నిష్పాక్షిక విచారణ జరిపిస్తామని హామీ
Advertisement
ప్రజాస్వామ్యం గురించి నేడు మాట్లాడుతున్న జగన్, వారి హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అరాచకాలకు ముందుగా సమాధానం చెప్పాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలపై జరిగిన దాడులను, ప్రజాస్వామ్య ఉల్లంఘనలను గుర్తు చేస్తూ జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
"నేడు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న జగన్ గారిని నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు, మీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు ముందు సమాధానం చెప్పండి. ఆ తర్వాతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు మీకు ఉంటుంది.
ఆనాడు మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నల వాహనంపై మీ పార్టీ శ్రేణులు దాడి చేసినప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా? పుంగనూరులో జనసేన అభ్యర్థి నామినేషన్ పత్రాలు చించివేసినప్పుడు రాజ్యాంగం ఏమైంది? మీ ఐదేళ్ల పాలనలో టీడీపీ, జనసేన అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారని వచ్చిన వేలాది ఫిర్యాదులకు మీ దగ్గర సమాధానం ఉందా? వీటన్నిటికీ జవాబు చెప్పకుండా ఈరోజు మీరు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది.
ఇప్పుడు ఎన్నికల సంఘం స్వతంత్రత గురించి మాట్లాడుతున్నారు కదా? మరి నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఆ చర్యను హైకోర్టు తప్పుబడుతూ కొట్టివేసిన విషయం మర్చిపోయారా? మీ హయాంలో బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణల ద్వారా ఏకగ్రీవాలు చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందో చెప్పాలి.
మీ పార్టీ నాయకుల దాడులు, బెదిరింపులతో మా కార్యకర్తల ప్రాణాలు కాపాడుకోవడమే గగనమైంది. అందుకే, తప్పనిసరి పరిస్థితుల్లో మేము స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాల్సి వచ్చింది. ఈ విషయం మీరు మర్చిపోయినా, ప్రజలు మర్చిపోలేదు.
మిథున్రెడ్డి ఘటనతో సహా అన్ని ఎన్నికల హింసాత్మక ఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే. చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను" అని స్పష్టం చేశారు.