పుంగనూరుకు రావొద్దు: పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలకు పోలీసుల నోటీసులు
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అట్టుడుకుతున్న పుంగనూరు
- ఎంపీ మిథున్ రెడ్డిపై నాలుగు కేసులు నమోదు
- పుంగనూరులోకి ప్రవేశించవద్దని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలకు నోటీసులు
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతిభద్రతల దృష్ట్యా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పట్టణంలోకి ప్రవేశించవద్దని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పెద్దిరెడ్డి, పుంగనూరు ఎన్నికల బరి నుంచి వైసీపీ వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
నామినేషన్ల తొలిరోజు టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిపై నాలుగు కేసులు నమోదు చేశారు. మరో 250 మందికి పైగా వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి.