Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బౌలింగ్ మెరుగ్గా ఉంటే సీరీస్ గెలిచేవాళ్లం: శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer Says Better Bowling Could Have Won The Series
Advertisement
  • 2-2తో భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్ సమం
  • చివరి మ్యాచ్‌కు అడ్డుపడిన వర్షం
  • బౌలింగ్ మెరుగ్గా ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్న అయ్యర్
  • వెస్టిండీస్ ఆటగాడు షాయ్ హోప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’
Advertisement
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సీరీస్ 2-2తో సమంగా ముగిసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లు ట్రోఫీని పంచుకున్నాయి. సిరీస్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తమ బౌలర్లు మరికొంత మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

వర్షం కారణంగా చివరి మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించగా, భారత్ 7.4 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసిన దశలో ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అనంతరం అయ్యర్ మాట్లాడుతూ "రెండో, నాలుగో మ్యాచ్‌లలో మా బౌలింగ్ మెరుగ్గా ఉండి ఉంటే సిరీస్ ఫలితం వేరేలా ఉండేది. అయితే వెస్టిండీస్ బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాలి. ముఖ్యంగా షాయ్ హోప్ ఈ సిరీస్ అంతటా అద్భుతంగా ఆడాడు. ఓటమి తర్వాత కూడా మేం పుంజుకున్న తీరు మా దూకుడైన మనస్తత్వానికి నిదర్శనం" అని పేర్కొన్నాడు.

యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. అవకాశాల కోసం ఓపికగా ఎదురుచూడాలని, తన ప్రక్రియను నమ్ముకుని నిలకడగా రాణించాలని సూచించినట్లు చెప్పాడు. భారత జట్టుకు ఇప్పటికే ఇద్దరు అద్భుతమైన ఓపెనర్లు ఉన్నారని అయ్యర్ గుర్తుచేశాడు.

మరోవైపు, ఈ సిరీస్‌లో రెండు సెంచరీలతో అదరగొట్టిన వెస్టిండీస్ ఆటగాడు షాయ్ హోప్ ‘ప్లేయర్ ఆఫ్ ద సీరీస్’గా నిలిచాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్‌లో సిరీస్ గెలిచే సువర్ణావకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నామని హోప్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ, తమ జట్టు ఆటతీరులో ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని, షమర్ స్ప్రింగర్, కీమో పాల్ వంటి ఆటగాళ్లు కీలక సమయాల్లో రాణించడం ఆనందాన్నిచ్చిందని తెలిపాడు. ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు గురువారం నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. 
Advertisement
Advertisement
Shreyas Iyer
India vs West Indies T20
Shai Hope
Chinnaswamy Stadium
India West Indies Series Draw
Vaibhav Suryavanshi

More Telugu News