Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ వద్ద హైవేపై కాలిబూడిదైన కారు.. సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్

Shamshabad car fire on highway driver escapes safely
Advertisement
  • హైదరాబాద్-బెంగళూరు హైవేపై కారులో చెలరేగిన మంటలు
  • అప్రమత్తమై వాహనం నుంచి బయటకు వచ్చిన డ్రైవర్
  • చూస్తుండగానే పూర్తిగా కాలిబూడిదైన కారు
  • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల అనుమానం
  • ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది
Advertisement
శంషాబాద్ సమీపంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణిస్తున్న ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగలేదు. అయితే, కారు మాత్రం పూర్తిగా కాలి బూడిదైంది.

వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కారులో శంషాబాద్ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ వెంటనే గమనించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారును రోడ్డు పక్కకు ఆపి, వాహనం నుంచి కిందకు దిగిపోయాడు. కొన్ని క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి కారును పూర్తిగా చుట్టుముట్టాయి.

రహదారిపై వెళుతున్న ఇతర ప్రయాణికులు ఈ ఘటనను చూసి భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, వారు వచ్చేసరికే కారు పూర్తిగా దగ్ధమైంది.

ఇంజిన్ వేడెక్కడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 
Advertisement
Advertisement
Shamshabad Car Fire
Hyderabad Bangalore Highway
Car accident NH 44
Vehicle fire incident
RGIA Police
Short circuit fire

More Telugu News