1980ల ట్రెండ్: అందరూ ఏఐ ఫొటోలు పెడుతుంటే.. సీఎం చంద్రబాబు ఏం చేశారంటే?

Andhra
Advertisement
  • సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న 1980ల నాటి ఏఐ ఫొటోల ట్రెండ్
  • ఏఐకి బదులుగా తన అసలైన ఫొటోలను పంచుకున్న సీఎం చంద్రబాబు
  • 1980లలోని తన పాస్‌పోర్ట్ ఫొటో, ఏఎన్ఆర్‌తో ఉన్న చిత్రాన్ని షేర్ చేసిన సీఎం
  • మరోవైపు ఏఐ ఫొటోతో ట్రెండ్‌లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
Advertisement
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ‘1980ల ట్రెండ్’ పేరుతో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో తమ 1980ల నాటి ఫొటోలను సృష్టించుకుని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్నంగా పాలుపంచుకున్నారు. ఏఐ ఫొటోలకు బదులుగా 1980ల నాటి తన అసలైన ఫొటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

నిన్న‌ తన సోషల్ మీడియా ఖాతాలో చంద్రబాబు మూడు ఫొటోలను పంచుకున్నారు. అందులో ఒకటి తన యవ్వనంలో తీయించుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫొటో కాగా, మరొకటి సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పటిది. ఇంకో ఫొటోలో తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో బస్సు సర్వీసును ప్రారంభిస్తున్న దృశ్యం ఉంది.

‘‘1980ల ట్రెండ్‌లో అసలైన వాటితో జతకలుపుతున్నాను. ఆ దశాబ్దానికి చెందిన నా కొన్ని నిజమైన ఫొటోలు ఇవి’’ అనే వ్యాఖ్యను ఈ పోస్టుకు జోడించారు. చంద్రబాబు తన పాత జ్ఞాపకాలను పంచుకోవడంపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

మరోవైపు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ మాత్రం ఈ ట్రెండ్‌ను అనుసరించారు. ఏఐ సాయంతో రూపొందించిన తన 1980ల నాటి ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Nara Chandrababu Naidu1980s trend social mediaNara Lokesh AI photosChandrababu Naidu old photosAkkineni Nageswara RaoChandragiri constituency

More Telugu News

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51

హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం.. అప్రమత్తమైన భారత సరిహద్దు జిల్లాలు

30 Oct, 08:47

ఇజ్రాయెల్‌లో హంగ్.. అనిశ్చితిలో నెతన్యాహు భవితవ్యం.. కింగ్ మేకర్లుగా అరబ్ పార్టీలు!

30 Oct, 08:35

మద్యం మత్తులో సెల్ఫీ కోసం రచ్చ.. కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం

30 Oct, 08:31

అర్నాబ్ తుపాను బీభత్సం.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం

30 Oct, 08:30

నా చెల్లి అపర్ణ సమర్థురాలు.. గెలిపించండి: నటుడు జగపతి బాబు

30 Oct, 08:21

ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు?.. హార్దిక్ భవిష్యత్తుపై నీలినీడలు

30 Oct, 07:59

బీజేపీకి షాక్.. దర్భంగా గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్జేడీ

30 Oct, 07:59

టీ20 చరిత్రలో సరికొత్త రికార్డ్.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్

30 Oct, 07:35

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. రైల్వే స్టేషన్‌లో మారణహోమం

30 Oct, 07:06

విలేకరిపై డొనాల్డ్ ట్రంప్ బాడీ షేమింగ్.. చూడటానికి భయంకరంగా ఉన్నావంటూ వ్యాఖ్యలు

30 Oct, 06:41

‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలపై దుమారం.. నసీరుద్దీన్ షాపై ఎన్డీఏ నేతల ఫైర్

30 Oct, 06:14

కొడుకుతో బంధంపై అమితాబ్ ఫన్నీ కామెంట్స్.. కేబీసీలో నవ్వులు

30 Oct, 06:10

ఆర్మేనియా పార్లమెంట్‌లో ఎంపీల ముష్టియుద్ధం.. ప్రజలు చూడాలని లైవ్ ఆపని స్పీకర్!

29 Oct, 22:48
..More Telugu News