అమెరికా మీడియా దృష్టిలో ‘బ్రిక్స్‌’‌.. మారుతున్న ప్రపంచ సమీకరణాలకు వేదిక

International
Advertisement
  • మోదీ, జిన్‌పింగ్‌లో ఎవరి ప్రభావం పెరుగుతుందన్న దానిపై ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఆసక్తి
  • బ్రిక్స్‌ను అన్ని దేశాలకు అందుబాటులో ఉన్న విస్తృత వేదికగా కొనసాగించాలని భారత్‌ కోరుకుంటోందని కథనం
  • రష్యా, ఇరాన్‌తో సంబంధాలు కొనసాగిస్తూనే పశ్చిమ దేశాలతో భారత్‌ భాగస్వామ్యాలు పెంచుకుంటోందని వ్యాఖ్య
  • ఉక్రెయిన్‌, మధ్యప్రాచ్య యుద్ధాలు బ్రిక్స్‌‌లో విభేదాలను బయటపెట్టే అవకాశముందని విశ్లేషణ
  • ట్రంప్‌తో జిన్‌పింగ్‌ భేటీకి ముందు న్యూఢిల్లీ బ్రిక్స్‌ సమావేశానికి ప్రాధాన్యం పెరిగిందని వ్యాఖ్య
Advertisement
ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు న్యూఢిల్లీలో జరుగుతున్న ‘బ్రిక్స్‌’ శిఖరాగ్ర సమావేశం అద్దం పడుతోందని ప్రముఖ అమెరికా పత్రికలు విశ్లేషించాయి. అమెరికా కూటములతో పెరుగుతున్న విభేదాలు, ప్రాంతీయ యుద్ధాలు, వాషింగ్టన్‌-బీజింగ్‌ మధ్య పోటీ ఈ సమావేశానికి ప్రాధాన్యం పెంచాయని పేర్కొన్నాయి.

మోదీ-జిన్‌పింగ్‌ ప్రభావంపై ఆసక్తి
‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లో ఎవరి ప్రభావం పెరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు ‘బ్రిక్స్‌’‌ను ఉపయోగించుకోవాలని చైనా  చూస్తోంది. భారత్‌ మాత్రం ఏ దేశమైనా ఒక కూటమి వైపు మొగ్గాల్సిన పరిస్థితి రాకుండా ‘బ్రిక్స్‌’‌ విస్తృత వేదికగా కొనసాగాలని కోరుకుంటోంది.

అమెరికా-చైనా మధ్య భారత్‌ సమతూకం
యుద్ధాలు, ఇంధన ధరల పెరుగుదల, అమెరికా సుంకాలు, కృత్రిమ మేధపై ఆందోళన వంటి అంశాల ఆధారంగా దేశాలు తమ విదేశాంగ విధానాలను పునఃపరిశీలించేలా చేస్తున్నాయని పత్రిక పేర్కొంది. భారత్‌-చైనా సంబంధాల్లో 2024లో మొదలైన దౌత్యపరమైన కదలికకు ఈ సమావేశం మరో వేదికగా మారింది.

పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ
‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ ప్రకారం.. భారత్‌, చైనాల సంబంధాలు అమెరికాతో కొత్త దశలోకి వెళుతున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే అవకాశం ఏర్పడింది. అయితే సరిహద్దు వివాదం, పాకిస్థాన్‌తో చైనా సన్నిహిత సంబంధాలు, హిందూ మహాసముద్రంలో భద్రతా పోటీ అడ్డంకులుగా ఉన్నాయి.

ఉక్రెయిన్‌, మధ్యప్రాచ్య యుద్ధాల ప్రభావం
‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ బ్రిక్స్‌ సమావేశాన్ని భారత్‌కు క్లిష్టమైన సమతూక పరీక్షగా అభివర్ణించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, జిన్‌పింగ్‌ సహా నేతలు సమావేశానికి హాజరవుతున్నారు. రష్యా, ఇరాన్‌తో భారత్‌ తన సంబంధాలను కొనసాగిస్తూనే అమెరికా, యూరప్‌, జపాన్‌, ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాలను విస్తరిస్తోంది. ఉక్రెయిన్‌, మధ్యప్రాచ్య యుద్ధాలు ‘బ్రిక్స్‌’‌లోని సభ్య దేశాల మధ్య విభేదాలను మరింత స్పష్టంగా చూపే అవకాశం ఉందని పత్రిక పేర్కొంది.

ట్రంప్‌తో జిన్‌పింగ్‌ భేటీకి ముందు
ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. సెప్టెంబరు 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఆయన వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు. దీంతో న్యూఢిల్లీ ‘బ్రిక్స్‌’‌ సమావేశానికి మరింత వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడిందని అమెరికా మీడియా పేర్కొంది.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51

హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం.. అప్రమత్తమైన భారత సరిహద్దు జిల్లాలు

30 Oct, 08:47

ఇజ్రాయెల్‌లో హంగ్.. అనిశ్చితిలో నెతన్యాహు భవితవ్యం.. కింగ్ మేకర్లుగా అరబ్ పార్టీలు!

30 Oct, 08:35

మద్యం మత్తులో సెల్ఫీ కోసం రచ్చ.. కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం

30 Oct, 08:31

అర్నాబ్ తుపాను బీభత్సం.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం

30 Oct, 08:30

నా చెల్లి అపర్ణ సమర్థురాలు.. గెలిపించండి: నటుడు జగపతి బాబు

30 Oct, 08:21

ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు?.. హార్దిక్ భవిష్యత్తుపై నీలినీడలు

30 Oct, 07:59

బీజేపీకి షాక్.. దర్భంగా గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్జేడీ

30 Oct, 07:59

టీ20 చరిత్రలో సరికొత్త రికార్డ్.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్

30 Oct, 07:35

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. రైల్వే స్టేషన్‌లో మారణహోమం

30 Oct, 07:06

విలేకరిపై డొనాల్డ్ ట్రంప్ బాడీ షేమింగ్.. చూడటానికి భయంకరంగా ఉన్నావంటూ వ్యాఖ్యలు

30 Oct, 06:41

‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలపై దుమారం.. నసీరుద్దీన్ షాపై ఎన్డీఏ నేతల ఫైర్

30 Oct, 06:14

కొడుకుతో బంధంపై అమితాబ్ ఫన్నీ కామెంట్స్.. కేబీసీలో నవ్వులు

30 Oct, 06:10

ఆర్మేనియా పార్లమెంట్‌లో ఎంపీల ముష్టియుద్ధం.. ప్రజలు చూడాలని లైవ్ ఆపని స్పీకర్!

29 Oct, 22:48

చంద్రబాబు విజ్ఞప్తికి వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

29 Oct, 22:38
..More Telugu News