'ప్యారడైజ్' నుంచి 'యేష నాగుల' సాంగ్ వచ్చేసింది.. ఇది కదా మాస్ బీట్!
- ప్యారడైజ్' నుంచి రెండో పాట 'యేష నాగుల కట్ట మీద' విడుదల
- అమెరికా డల్లాస్‌లో అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో గ్రాండ్ లాంచ్
- జడల గెటప్‌లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి డ్యాన్స్ చేసిన నాని
- పాటలో నాని, కీర్తి సురేష్ మాస్ స్టెప్పులు హైలైట్
- తాజాగా యూట్యూబ్ లో విడుదల
- సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
నేచురల్ స్టార్ నాని, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌తో అంచనాలను పెంచేసిన ఈ చిత్రం నుంచి మరో సర్ప్రైజ్ వచ్చేసింది. 'యేష నాగుల కట్ట మీద' అంటూ సాగే రెండో పాటను చిత్రబృందం వినూత్నంగా విడుదల చేసి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తాజాగా యూట్యూబ్ లో ఈ పాటను విడుదల చేశారు.
ఈ పాటను అమెరికాలోని డల్లాస్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ నిర్వహిస్తున్న లైవ్ కాన్సర్ట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి నాని 'జడల్' పాత్ర గెటప్‌లో (పొడవాటి జుట్టు, రెక్కల డిజైన్‌తో ఉన్న ప్రత్యేక జాకెట్‌తో) సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఉర్రూతలూగించారు. వేదికపై అనిరుధ్‌తో కలిసి నాని వేసిన మాస్ స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా దిష్టి తగలకుండా సినిమాలోని ఓ డైలాగ్‌ను కూడా నాని ప్రేక్షకులతో చెప్పించి అలరించారు. ఇప్పుడు ఈ పాటను డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోనూ విడుదల చేశారు.
తెలంగాణ జానపదానికి అనిరుధ్ తనదైన శైలిలో మాస్ బీట్స్ జోడించి స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, జంగి రెడ్డి, ప్రభ ఆలపించారు. ఈ పాటలో నాని, కీర్తి సురేశ్ కలిసి మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. 'దసరా' తర్వాత నాని, కీర్తి, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పాట విడుదల సందర్భంగా కీర్తి సురేశ్, నాని మధ్య సోషల్ మీడియాలో జరిగిన సరదా సంభాషణ కూడా వైరల్ అయింది.
ఈ చిత్రంలో నాని తన భూమి, ప్రజల కోసం పోరాడే శక్తివంతమైన 'జడల్' పాత్రలో కనిపించనున్నారు. కయాదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.