'టాక్సిక్' ఫలితంపై నయనతార స్పందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'టాక్సిక్' ఫలితంపై నయనతార స్పందన

Nayanthara response on Toxic movie result
  • సినిమా అనేది ఎంతో భావోద్వేగమైనదన్న నయనతార
  • కొండంత ఆశలు పెట్టుకున్న చిత్రాలు కూడా డిజాస్టర్ అవుతాయని వ్యాఖ్య
  • ఫలితం ఎలా వచ్చినా ఒకే విధంగా స్వీకరించడాన్ని తాను నేర్చుకున్నానన్న నయన్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్, నయనతార తదితరులు నటించిన చిత్రం ‘టాక్సిక్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలు అందుకుంటోంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నయనతార స్పందించారు.


సినిమా ఫలితాల గురించి మాట్లాడుతూ... "పరిశ్రమలో ఉన్న అనుభవం ఒక సినిమాను ఎలా తీస్తారనే దానిపై ప్రాథమిక అవగాహన ఇస్తుంది కానీ, సినిమా అనేది ఎంతో భావోద్వేగభరితమైనది, ఊహించని మలుపులతో కూడుకున్నది. నా కెరీర్‌లో కచ్చితంగా పెద్ద హిట్ అవుతాయని కొండంత ఆశలు పెట్టుకున్న కొన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అదే సమయంలో, కొన్ని చిత్రాల ఫలితంపై నాకే సందేహాలు ఉండేవి కానీ, అవి బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో భారీ విజయాలు సాధించి ఆశ్చర్యపరిచాయి" అని తెలిపారు.


ఈ ఒడిదొడుకుల నుంచి తాను నేర్చుకున్న ముఖ్యమైన పాఠం గురించి చెబుతూ... "చిత్ర పరిశ్రమలో నా ఇన్నేళ్ల ప్రయాణం ఒక విషయాన్ని నేర్పింది. సినిమా విజయమైనా, అపజయమైనా రెండింటినీ ఒకే విధంగా, వినయంతో స్వీకరించడం నేను నేర్చుకున్నాను" అని స్పష్టం చేశారు.

Advertisement
Nayanthara
Toxic movie
Yash
Toxic box office failure
Nayanthara interview
Kannada cinema

More Telugu News