ఓటీటీకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్!
- మలయాళంలో రూపొందిన 'ఉన్మాదం'
- జులై 31వ తేదీన విడుదలైన సినిమా
- పోలీస్ ఇన్వెస్టిగేషన్ గా నడిచే కథ
- త్వరలో 'సోనీలివ్'లో స్ట్రీమింగ్
- కథానాయికగా లిజో మోల్ జోస్
కుంచాకో బోబన్ కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకు కారణం ఆయన ఎంచుకుంటున్న కథలు .. పాత్రలు అనే చెప్పాలి. అలాంటి ఆయన కథానాయకుడిగా నటించిన సినిమానే 'ఉన్మాదం'. ఎడిటింగ్ లో మంచి అనుభవం ఉన్న కిరణ్ దాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. జులై 31వ తేదీన థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కుంచాకో బోబన్ కనిపించనున్నాడు. ఆయన సరసన కథానాయికగా 'లిజోమోల్ జోస్' నటించింది. ఇతర ముఖ్యమైన పాత్రలలో సిద్ధుఖీ .. కృష్ణప్రభ .. విశాఖ్ నాయర్ .. సుధీశ్ .. కొట్టాయం నజీర్ కనిపించనున్నారు. ముజీబ్ మజీద్ బాణీలను సమకూర్చిన ఈ సినిమాకి, జస్టీన్ వర్గీస్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. అలాంటి ఈ సినిమాను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా 'సోనీలివ్' అధికారిక ప్రకటన చేసింది.
'షెల్లీ' ఒక పోలీస్ ఆఫీసర్. అతను తన డ్యూటీ తాను చేస్తూ వెళుతుంటాడు. అయితే సినిమా రైటర్ గా మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక బలమైన కోరిక అతనిని ఆ వైపుకు లాగుతూ ఉంటుంది. ఒక రోజున ఒక పాత కేసుకు సంబంధించిన ఫైల్ అతని కంట పడుతుంది. ఆ కేసులోని మలుపులు .. అనుమానాలు అతనిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆ కేసు ఆధారంగా అతను ఒక కథను సిద్ధం చేసుకోవాలని అనుకుంటాడు. అప్పటి నుంచి అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.