కెమెరాలపై కొడుకు ఆగ్రహం.. కోర్టులో గోవిందా అర్ధాంగి సునీత.. అసలేం జరిగింది?
- ఫ్యామిలీ కోర్టులో కనిపించిన గోవిందా అర్ధాంగి సునీత, కొడుకు యశవర్ధన్
- భర్త గోవిందాతో బహిరంగ వివాదం నేపథ్యంలో కోర్టుకు రావడంపై చర్చ
- గోవిందాను ‘షుగర్ డాడీ’ అంటూ సునీత చేసిన వ్యాఖ్యలతో ముదిరిన గొడవ
- తన పనిలో జోక్యం చేసుకోవద్దంటూ భార్యకు వీడియో సందేశం పంపిన గోవిందా
- గతంలోనూ విడాకుల దాకా వెళ్లిన వీరి బంధం, మళ్లీ తెరపైకి కుటుంబ కలహాలు
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన అర్ధాంగి సునీత అహుజా మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న బహిరంగ వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. ఇవాళ సునీత తన కొడుకు యశవర్ధన్‌తో కలిసి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు రావడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. భార్యాభర్తల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిన నేపథ్యంలో వీరిద్దరూ కోర్టును ఆశ్రయించడంతో వారి బంధంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
కోర్టు నుంచి బయటకు వస్తున్న సునీత, యశవర్ధన్‌లను ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. దీంతో యశవర్ధన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన తల్లికి దారి ఇవ్వాలంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం ప్రదర్శించాడు. కోర్టుకు ఎందుకు వచ్చారని విలేకరులు ప్రశ్నించగా.. యశవర్ధన్ 'ఏం లేదు' అని గట్టిగా సమాధానమిచ్చాడు. అయితే, సునీత మాత్రం "పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చాం" అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. ఈ పరిణామంతో వారి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది.
వివాదానికి కారణం ఇదే..!
ఇటీవల గోవిందా తన ‘రూప’ సినిమా సహనటి, తనకంటే వయసులో చాలా చిన్నదైన కోమల్ రాణి స్వర్ణకర్‌తో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై సునీత తీవ్రంగా స్పందించారు. తన కూతురి వయసున్న అమ్మాయితో గోవిందా తిరుగుతున్నాడని, ఆయన్ను ‘షుగర్ డాడీ’ అని సంబోధిస్తూ బహిరంగంగా విమర్శించారు. నటి కోమల్‌పై కూడా వ్యాఖ్యలు చేస్తూ, సరిగా దుస్తులు ధరించాలని సూచించారు.
భార్యకు గోవిందా ఘాటు జవాబు
సునీత వ్యాఖ్యలపై గోవిందా కూడా వీడియో సందేశం ద్వారా ఘాటుగా స్పందించారు. తన వృత్తిపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, తన ప్రతిష్ఠకు, వ్యాపారానికి నష్టం కలిగించేలా మాట్లాడొద్దని అర్ధాంగిని హెచ్చరించారు. తనకంటే చిన్న వయసు హీరోయిన్లతో నటించడం చిత్ర పరిశ్రమలో కొత్తేమీ కాదని, వృత్తిపరమైన బంధాలను వ్యక్తిగత సంబంధాలుగా చూడొద్దని స్పష్టం చేశారు. అంతేకాకుండా బహిరంగంగా మాట్లాడేటప్పుడు భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అసభ్య పదజాలం వాడొద్దని సునీతకు హితవు పలికారు.
గతంలోనూ విడాకుల దాకా..
గోవిందా, సునీత మధ్య విభేదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వీరి వివాహం విడాకుల దాకా వెళ్లింది. 2024 డిసెంబర్‌లో సునీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని నెలలకే గణేష్ చతుర్థి వేడుకల్లో ఇద్దరూ కలిసి కనిపించి, తమ బంధాన్ని ఎవరూ విడదీయలేరని ప్రకటించారు. 1987లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు కుమార్తె టీనా అహుజా, కుమారుడు యశవర్ధన్ ఉన్నారు. తాజా పరిణామాలతో వీరి బంధం మరోసారి వార్తల్లో నిలిచింది.