రామ్ పోతినేని డెడికేషన్‌కు హాట్సాఫ్.. ఆపకుండా 24 గంటల పాటు షూటింగ్
- ‘రాపో23’ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రామ్ పోతినేని
- హీరోతో పాటు దర్శకత్వ బాధ్యతలూ చేపడుతున్న రామ్
- ఆయన చూపిస్తున్న అంకితభావంపై చిత్ర బృందం ప్రశంసలు
- పుదుచ్చేరి షెడ్యూల్‌కు వర్షాలతో బ్రేక్
- ‘వీర’ పాత్రలో కనిపించనున్న రామ్
హీరో రామ్ పోతినేని తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాపో23’ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటిస్తున్న రామ్.. పుదుచ్చేరి శివార్లలో ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా షూటింగ్‌లో పాల్గొన్నట్లు సినీ వర్గాల సమాచారం. నటుడిగా తన పాత్రను పూర్తి చేయడంతో పాటు దర్శకుడిగా సినిమా చిత్రీకరణను పర్యవేక్షిస్తూ రామ్ బిజీగా ఉన్నారు. ఈ విషయంలో ఆయన చూపిస్తున్న అంకితభావంపై చిత్ర బృందం ప్రశంసలు కురిపిస్తోంది.
‘రాపో23’ కోసం పుదుచ్చేరిలో భారీ స్థాయిలో ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు తొమ్మిది రోజుల పాటు అక్కడ షూటింగ్ కొనసాగింది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయంలో అనూహ్యంగా వర్షాలు రావడంతో చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. దీంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి చిత్ర బృందం హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. మిగిలిన సన్నివేశాలను పూర్తి చేసేందుకు త్వరలోనే మరోసారి పుదుచ్చేరికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా నేతృత్వంలో ఓ ప్రత్యేక పాటను తెరకెక్కించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. అలాగే ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కాంతారా’ వంటి చిత్రాలకు పనిచేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ రూపొందిస్తున్న పలు హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. దీంతో పుదుచ్చేరి షెడ్యూల్ సినిమాకు కీలకంగా మారనుంది.
రామ్ పోతినేని స్వయంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై కృష్ణ పోతినేని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘రాపో23’ను సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. నయా-నోయర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ ‘వీర’ అనే పాత్రలో కనిపించనున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.