ఆరేళ్ల తర్వాత.. రానా-మిహీకా పెళ్లి నాటి అపురూపమైన ఫొటోలు
- రానా, మిహీకా వివాహానికి ఆరేళ్లు పూర్తి
- పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మిహీకా
- ‘08.08.2020’ అంటూ పెళ్లి తేదీని గుర్తుచేసుకున్న మిహీకా
- పోస్ట్‌పై దుల్కర్ సల్మాన్ స్పందన
- 2020 ఆగస్టు 8న కరోనా సమయంలో వివాహం
- ‘రాక్షస రాజా’లో నటిస్తున్న రానా
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మిహీకా తమ పెళ్లికి సంబంధించిన రెండు అపురూపమైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
పెళ్లి వేడుకలో రానా, మిహీకా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటున్న ఫొటోను ఆమె తొలుత షేర్ చేశారు. మరో ఫొటోలో పెళ్లి వేడుకలో మిహీకా సిగ్గుపడుతూ కనిపించారు. ఈ ఫొటోలకు ‘08.08.2020’ అంటూ తమ పెళ్లి తేదీని క్యాప్షన్‌గా పెట్టారు.
ఈ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. నటుడు దుల్కర్ సల్మాన్ హార్ట్ ఎమోజీలతో ‘ఎప్పటికీ నా ఫేవరెట్స్’ అంటూ కామెంట్ చేశారు.
రానా సోదరి మాళవికతో మిహీకా కలిసి చదువుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కరోనా సమయంలో 2020 ఆగస్టు 8న హైదరాబాద్‌లో వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వేడుక నిర్వహించారు. సమంత, రామ్‌చరణ్, నాగచైతన్య తదితరులు హాజరయ్యారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రానా ప్రస్తుతం ‘రాక్షస రాజా’లో నటిస్తున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. తమిళ చిత్రం ‘పరాశక్తి’లోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు ‘నీలిరా’ అనే వార్ మూవీని నిర్మిస్తున్నారు.