ఉదయనిధిని విజయ్ అరెస్ట్ చేయిస్తారని కలలో కూడా ఊహించలేదు: విశాల్

Vishal never imagined Vijay would have Udhayanidhi arrested
  • రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న విశాల్
  • కాలేజీలో విజయ్ తన సీనియర్, ఉదయనిధి తన బ్యాచ్‌మేట్ అని వెల్లడి
  • ఉదయనిధి అరెస్ట్ పొలిటికల్ గేమ్ లో భాగమేనని వ్యాఖ్య

రాజకీయ నాయకులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు విశాల్ సూచించారు. ఆయన దర్శకత్వం వహించి, కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మకుటం’ (తమిళంలో ‘మగుడం’) సినిమా ప్రచారానికి సంబంధించిన ఇంటర్వ్యూలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్, నటి త్రిషపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు.


సభలలో మాట్లాడే ముందు సిద్ధం చేసుకున్న ప్రసంగాలు అయితే ఎలాంటి ఇబ్బందులు రావని, అప్పటికప్పుడు మాట్లాడే సమయంలోనే పొరపాట్లు దొర్లుతాయని విశాల్ అభిప్రాయపడ్డారు. "లయోలా కాలేజీలో నా సీనియర్ (విజయ్), నా బ్యాచ్‌మేట్ (ఉదయనిధి) ని ఇలా ఒకరోజు అరెస్ట్ చేయిస్తారని కలలో కూడా ఊహించలేదు. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో ఉన్నారు, ఇదంతా పొలిటికల్ గేమ్‌లో భాగమే" అని విశాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు, తమిళనాడు రాజకీయాల్లో విశాల్ ఎంట్రీపై కూడా ఊహాగానాలు జోరందుకున్నాయి.

Advertisement
Vishal
Udhayanidhi Stalin
Thalapathy Vijay
Makutam Movie
Tamil Nadu Politics
Vishal Political Entry

More Telugu News