ఇది నీ శ్రమకు తగిన ప్రతిఫలం వరుణ్‌.. 'కొరియన్ కనకరాజు'పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

ఇది నీ శ్రమకు తగిన ప్రతిఫలం వరుణ్‌.. 'కొరియన్ కనకరాజు'పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

Chiranjeevi tweets about Korean Kanakaraju and says will watch it soon
  • నేడు విడుదలైన వరుణ్ తేజ్‌ 'కొరియన్ కనకరాజు'
  • సినిమాకు అన్నిచోట్లా మంచి స్పంద‌న‌
  • సోషల్ మీడియాలో చిత్ర యూనిట్‌ను అభినందించిన చిరు
  • వరుణ్ శ్రమకు, నిజాయతీకి తగిన ఫలితమన్న మెగాస్టార్
  • సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని ఆకాంక్ష
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారర్-కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా 'నవ్వులే నవ్వులు' అనే మాట వినిపిస్తోందని చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. "డియర్ వరుణ్ తేజ్.. నువ్వు ఈ విజయానికి పూర్తిగా అర్హుడివి. నీ శ్రమకు, నిజాయతీకి సరైన ప్రతిఫలం దక్కింది" అని అభినందించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, కమెడియన్ సత్య, హీరోయిన్ రితికా నాయక్, నిర్మాతలకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ అనంతపురం యువకుడిగా, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌, రాయలసీమ యాసలో మాట్లాడి అలరించారు. అనంతపురం జిల్లా పెనుగొండ నేపథ్యంలో సాగే ఈ కథలో, కియా కంపెనీలో పనిచేసే అమ్మాయిని ప్రేమించడం, ఆపై కొరియన్ సంస్కృతికి సంబంధించిన పరిణామాలు నవ్వులు పూయిస్తాయి.

తాను త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తానని, ఇది మరింత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Chiranjeevi
Korean Kanakaraju
Varun Tej
Merlapaka Gandhi
Tollywood News
Korean Kanakaraju Movie

More Telugu News