‘దిష్టంతా పోవాలే’.. నాని ఒక్క డైలాగ్‌తో దద్దరిల్లిన ‘ప్యారడైజ్‌’ టీజర్

Nani The Paradise teaser roars with powerful single dialogue
  • విడుదలైన ‘ది ప్యారడైజ్’ టీజర్
  • మాస్ లుక్‌లో ఆకట్టుకుంటున్న నాని
  • ప్రత్యేకంగా నిలిచిన యాక్షన్ సన్నివేశాలు
  • వైరల్‌ అవుతోన్న ‘దిష్టంతా పోవాలే!’ డైలాగ్
  • అనిరుధ్ బీజీఎంతో టీజర్‌కు మరింత బలం
  • వచ్చే నెల 24న సినిమా విడుదల
టాలీవుడ్ హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ విడుదలైంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న వేళ వచ్చిన ఈ టీజర్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంటోంది.

టీజర్‌లో నాని ఇప్పటివరకు కనిపించని మాస్ లుక్‌లో కనిపించారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. చేతి నిండా బ్లేడ్లు పట్టుకుని కనిపించే సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘దిష్టంతా పోవాలే’ అంటూ నాని చెప్పిన డైలాగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

టీజర్‌కు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం మరో హైలెట్‌గా నిలిచింది. ప్రతి యాక్షన్ సీన్‌కు తగ్గట్టుగా వచ్చిన బీజీఎం టీజర్‌కు మరింత బలం తీసుకొచ్చింది. విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ సినిమాలో నాని సరసన కాయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. టీజర్‌కు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘ది ప్యారడైజ్’ వచ్చే నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Nani
The Paradise Teaser
Srikanth Odela
Anirudh Ravichander
Kayadu Lohar
The Paradise Movie

More Telugu News