ఆయుధాలతో లొంగిపోయిన మావోయిస్టు
న్యూడెమొక్రసీ దళసభ్యుడు రఘు ఆయుధాలతో వరంగల్ జిల్లా ఖానాపురం పోలీసులకు లొంగిపోయాడు. ఖమ్మం జిల్లా గుండాల అటవీ ప్రాంతం నుంచి ఏకే 47, మరో రెండు ఆయుధాలతో పారిపోయిన రఘు పోలీసులకు లొంగిపోవడంతో, అతడిని కోవర్టుగా న్యూడెమొక్రసీ దళం ఆరోపిస్తోంది. రఘుది వరంగల్ జిల్లా కుదరావు పేట.